పరిశోధనలకు ప్రోత్సాహకాలు

భారత దేశ చరిత్ర-సంస్కృతి, మతం, ఆర్థికవ్యవస్థ, పర్యావరణం తదితర విభాగాల్లో పరిశోధనలను జేఎన్‌ఎంఎఫ్‌ ప్రోత్సహిస్తోంది. ఈ అభ్యర్థులకు రెండేళ్లపాటు ఉపకారవేతనాలను అందిస్తోంది.

Published : 14 Apr 2020 01:48 IST

భారత దేశ చరిత్ర-సంస్కృతి, మతం, ఆర్థికవ్యవస్థ, పర్యావరణం తదితర విభాగాల్లో పరిశోధనలను జేఎన్‌ఎంఎఫ్‌ ప్రోత్సహిస్తోంది. ఈ అభ్యర్థులకు రెండేళ్లపాటు ఉపకారవేతనాలను అందిస్తోంది.

మనదేశ విద్యార్థులకూ, ఆసియా దేశాల నుంచి వచ్చి భారత్‌లో పీహెచ్‌డీ చేస్తున్న అభ్యర్థులకూ జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ ఫండ్‌ ఉపకారవేతనాలను అందిస్తోంది. ట్యూషన్‌ ఫీజులతోపాటు కొన్ని అవసర వ్యయాల కోసం ఈ స్కాలర్‌షిప్‌ను వినియోగించుకోవచ్చు. వివిధ రంగాల్లో పరిశోధనలను పెంపొదించేందుకు వీటిని ఇస్తున్నారు.

ఏయే రంగాల్లో?
ఇండియన్‌ హిస్టరీ అండ్‌ సివిలైజేషన్‌, సోషియాలజీ, కంపారిటివ్‌ స్టడీస్‌ ఇన్‌ రెలిజియన్‌ అండ్‌ కల్చర్‌, ఎకనామిక్స్‌, జాగ్రఫీ, ఫిలాసఫీ, ఎకాలజీ అండ్‌ ఎన్వైరాన్‌మెంట్‌ విభాగాల్లో పీహెచ్‌డీ చేసే అభ్యర్థులు ఈ ఉపకారవేతనాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు
దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీని 60 శాతం మార్కులతో ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీలోనూ 60 శాతం మార్కులు పొందాలి. గుర్తింపు పొందిన సంస్థల్లో ఫుల్‌టైమ్‌ పీహెచ్‌డీకి అడ్మిషన్‌ పొంది ఉండాలి. పీహెచ్‌డీ రిజిస్ట్రేషన్‌కి అప్లై చేసుకున్నవాళ్లు,  ఇంకా సీటు పొందనివాళ్లు స్కాలర్‌షిప్‌కు అర్హులు కాదు.వయసు 35 సంవత్సరాలు మించకూడదు.

రెండేళ్ల వరకు సాయం
ఎంపికైనవారికి రెండేళ్ల వరకు స్కాలర్‌షిప్‌ అందుతుంది. ఇందులో నిర్వహణ వ్యయాల సహా ట్యూషన్‌ ఫీజు కోసం నెలకు రూ. 18,000 ఇస్తారు. స్టడీటూర్‌లు, పుస్తకాల కొనుగోళ్లు, స్టేషనరీ ఖర్చుల కోసం సంవత్సరానికి మరో రూ. 15,000 అందిస్తారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులకు గురవకుండా చూడటమే దీని లక్ష్యం.

దరఖాస్తు ఎలా?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ట్రస్ట్‌ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పూర్తిచేసిన దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లు జత చేసి అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ, జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌  ఫండ్‌, తీన్‌మూర్తి హౌస్‌, న్యూదిల్లీ - 110011 చిరునామాకు పంపాలి.
సెలక్షన్‌ కమిటీ నిర్ణయం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. లేదా ఇంటర్వ్యూలకు పిలుస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2020. https://www.jnmf.in/sabout.html


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని