దూరవిద్యలో ఎంబీఏ చేయవచ్చా?

ఫార్మసీ సంస్థలో సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేస్తున్నాను. ఉద్యోగంలో ఉన్నతస్థాయిని అందుకోవడానికి ఎంబీఏ చేస్తే ఎలా ఉంటుంది? దూరవిద్యలో ఉన్న అవకాశాలు, వాటి ప్రవేశ వివరాలను తెలియజేయండి...

Published : 29 Apr 2020 00:13 IST

*ఫార్మసీ సంస్థలో సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేస్తున్నాను. ఉద్యోగంలో ఉన్నతస్థాయిని అందుకోవడానికి ఎంబీఏ చేస్తే ఎలా ఉంటుంది? దూరవిద్యలో ఉన్న అవకాశాలు, వాటి ప్రవేశ వివరాలను తెలియజేయండి.

- పి. వైకుంఠరావు

* ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలనుకునే వారికి ఎంబీఏ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్ల్‌ాంటి కోర్సులు ఉన్నత  అవకాశాలను అందిస్తాయి. మనదేశంలో దూరవిద్య ద్వారా ఎంబీఏ చేయాలనుకునేవారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ  రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలూ; ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆంధ్ర, శ్రీ వేంకటేశ్వర, ఆచార్య నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు దూరవిద్యలో ఎంబీఏని అందిస్తున్నాయి. తెలంగాణలోని యూనివర్సిటీల్లో చదవాలనుకొంటే  టీ¨ఎస్‌ఐసెట్‌ ప్రవేశ పరీక్షనూ, ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో చదవాలనుకొంటే ఏపీఐసెట్‌ ప్రవేశ పరీక్షనూ రాయాలి. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ కూడా ఎంబీఏను దూరవిద్య ద్వారా అందిస్తోంది. ఇందులో ప్రవేశానికి ప్రత్యేక ఎంట్రన్స్‌ రాయాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఎంబీఏను దూరవిద్యలో అందిస్తున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో చేయవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని