గణితంలో దూరవిద్యా కోర్సులు?

ఇంజినీరింగ్‌ (ఈఈఈ)ను 2012లో చదివాను. ప్రస్తుతం ఆర్‌బీఐలో పనిచేస్తున్నాను. నాకు లెక్కలంటే ఆసక్తి. గణితశాస్త్రంలో ఉన్నతవిద్య చదవాలనుంది. దూరవిద్య ద్వారా

Published : 11 May 2020 00:26 IST

* ఇంజినీరింగ్‌ (ఈఈఈ)ను 2012లో చదివాను. ప్రస్తుతం ఆర్‌బీఐలో పనిచేస్తున్నాను. నాకు లెక్కలంటే ఆసక్తి. గణితశాస్త్రంలో ఉన్నతవిద్య చదవాలనుంది. దూరవిద్య ద్వారా అందుబాటులో ఉన్న కోర్సులేంటి?

- పవన్‌ కుమార్‌

సాధారణంగా గణితశాస్త్రంలో ఉన్నతవిద్య అభ్యసించాలంటే డిగ్రీ స్థాయిలో గణితం ఒక సబ్జెక్టుగా మూడు సంవత్సరాల పాటు చదివి ఉండాలి. కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ చదివినవారికి ఎంఎస్సీ మ్యాథమెటిక్స్‌ కోర్సును దూరవిద్య ద్వారా చదివే అవకాశాన్ని కల్పిస్తోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు మరి కొన్ని విశ్వవిద్యాలయాలు పీజీ డిప్లొమా ఇన్‌ మాథమాటిక్స్‌ కోర్సును ఏ డిగ్రీ చదివిన వారికైనా అందిస్తున్నాయి. మీకు కంప్యూటింగ్‌ రంగంలో ఆసక్తి ఉంటే కంప్యూటరు కోర్సులు గానీ, స్టాటిస్టిక్స్‌లో కొంత ప్రవేశం ఉంటే డాటా సైన్స్‌ లాంటి కోర్సులు గానీ చదువుకొనే అవకాశం ఉంది.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని