జెనెటిక్‌ ఇంజినీరింగ్‌.. ఎలా?

బీటెక్‌ బయోటెక్నాలజీ తరువాత జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ చేయొచ్చా?

Published : 04 Jan 2021 01:51 IST

బీటెక్‌ బయోటెక్నాలజీ తరువాత జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ చేయొచ్చా?

     - చేతన్‌ కశ్యప్‌

* బీటెక్‌ బయోటెక్నాలజీ కోర్సులో చేరడానికి 10+2లో మ్యాథ్స్‌/ బయాలజీ , ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు ఇంటర్మీడియట్‌లో ఆంగ్లం ఒక సబ్జెక్టుగా చదివివుండడం తప్పనిసరి. ఈ కోర్సుకు ప్రవేశాలు ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సాధించిన మెరిట్‌ను బట్టి జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ కోర్సును ఎన్‌ఐటీ వరంగల్‌, ఆంధ్ర విశ్వవిద్యాలయం, కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలతో పాటు అతితక్కువ ప్రైవేట్‌ కళాశాలలు అందిస్తున్నాయి. బీటెక్‌ బయోటెక్నాలజీ తరువాత జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌తో పీజీ చేయొచ్చు. డిగ్రీలోనే జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చదవాలనే కోర్కె ఉంటే, ఇంటర్మీడియట్‌ అర్హతతో జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ కోర్సుని కూడా చదవొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని