Order for a pizza అనొచ్చా?

ఇంగ్లిష్‌ భాషను మాట్లాడేటప్పుడూ, రాసేటప్పుడూ చాలా సందేహాలు వస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకుంటే ప్రామాణిక భాష అలవాటవుతుంది.

Updated : 20 Sep 2021 06:12 IST

ఇంగ్లిష్‌ భాషను మాట్లాడేటప్పుడూ, రాసేటప్పుడూ చాలా సందేహాలు వస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకుంటే ప్రామాణిక భాష అలవాటవుతుంది. విద్యార్థులు సాధారణంగా పొరపాటుగా ఉపయోగించే కొన్ని వ్యక్తీకరణలను తెలుసుకుందాం! ఈ Common errors పోటీ పరీక్షల్లోనూ ఉపయోగపడతాయి!

ప్రతి భాషకూ సహజసిద్ధమైన, నిర్దిష్టమైన expressions (వ్యక్తీకరణలు) ఉంటాయి. వాటిని అలాగే నేర్చుకోవాలి, ఉపయోగించాలి. మాతృభాషలోకి అనువదించినట్టు మాట్లాడితే, రాస్తే అసహజంగా ఉంటుంది. ఒక్కోసారి ఎదుటి వ్యక్తికి మన భావం అర్థం కాకపోయే ప్రమాదమూ ఉండొచ్ఛు అందుకని సరైన వ్యక్తీకరణలను నేర్చుకోవటం అవసరం.

‘పొరపాట్లు చేయటం’ అని తెలుగులో అంటాం కదా? ఈ ప్రభావంతోనే Doing mistakes అనేది వచ్చింది.

ఉదాహరణకు- I did a mistake.

ప్రామాణిక రూపం ఇలా ఉండదు.

I made a mistake అనటం సరైనది.

Is he doing mistakes?X

Is he making mistakes? 

ఆన్‌లైన్‌లో ఆహారం తెప్పించుకునేటప్పుడో, హోటల్‌కి వెళ్లినపుడో Order for a pizza అంటున్నారా?

ఇక నుంచీ- Order a pizza అనండి.

I have ordered for biryani X

I have ordered biryani 

‘Hi guys, What are you doing?’

‘We are discussing about pandemic’

ఇలాంటి సంభాషణలు తరచూ వింటుంటాం. ప్రశ్నకు చెప్పిన జవాబు (రెండో వాక్యం)లో ఓ దోషముంది.

ఇంగ్లిష్‌ భాషలో - Discuss the topic ఉంటుంది కానీ Discuss about the topic ఉండదు.

అందుకే...

‘We are discussing pandemic’ అనటం సరైనది.

The students have discussed about constitution amendments X

The students have discussed constitution amendments ●


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని