బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివితే..

డిగ్రీ (బీఎస్సీ కంప్యూటర్స్‌) పూర్తిచేశాను. నాకున్న ప్రభుత్వ ఉద్యోగాలేమిటి? సాఫ్ట్‌వేర్‌ కూడా నేర్చుకోవాలనుంది. దీనికి ఏయే కోర్సులు చేయాలి?...

Updated : 29 Nov 2021 06:38 IST

డిగ్రీ (బీఎస్సీ కంప్యూటర్స్‌) పూర్తిచేశాను. నాకున్న ప్రభుత్వ ఉద్యోగాలేమిటి? సాఫ్ట్‌వేర్‌ కూడా నేర్చుకోవాలనుంది. దీనికి ఏయే కోర్సులు చేయాలి?

- కె. మధు

బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివినవారికి ప్రభుత్వ ఉద్యోగావకాశాలు తక్కువేనని చెప్పవచ్చు. చాలా ప్రభుత్వరంగ సంస్థల్లో అవుట్‌ సోర్సింగ్‌/ కాంట్రాక్ట్‌ పద్ధతిలో ఐటీ నియామకాలు చేస్తున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివినవారికి డేటా ఎంట్రీ ఆపరేటర్‌, నెట్‌ వర్కింగ్‌ ఇంజినీర్‌, వెబ్‌ డెవలపర్‌, జూనియర్‌ ప్రోగ్రామర్‌ లాంటి ఉద్యోగాలకు అర్హత ఉంటుంది. సాధారణంగా కంప్యూటర్స్‌కు సంబంధించిన డిగ్రీలు చదివినవారికి ప్రైవేటు రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు బీఎస్సీలో కంప్యూటర్స్‌తో పాటు ఏయే సబ్జెక్టులు
చదివారో చెప్పలేదు. మీరు కంప్యూటర్స్‌తో పాటు స్టాటిస్టిక్స్‌ చదివివుంటే డేటా సైన్స్‌, ఆక్చూరియల్‌ సైన్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌ లాంటి రంగాల్లో ప్రవేశించవచ్చు. ఏదైనా ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల కోసం ఎంఎస్‌ ఎక్సెల్‌, ఆర్‌ ప్రోగ్రామింగ్‌, పైతాన్‌, మ్యాట్‌ ల్యాబ్‌, సీ ప్రోగ్రామింగ్‌, జావా, విజువల్‌ బేసిక్‌, ఎస్‌క్యూఎల్‌ లాంటి వాటిని నేర్చుకోవడం ముఖ్యం. బీఎస్సీతోనే చదువు ఆపేయకుండా వీలుంటే ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కానీ, ఎంసీఏ కానీ, ఎమ్మెస్సీ డేటా సైన్స్‌ కానీ, ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కానీ చదివితే మెరుగైన ఐటీ ఉద్యోగాలకు మీరు అర్హత సాధిస్తారు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని