సోషియాలజీతో...

దూరవిద్యలో సోషియాలజీ డిగ్రీ చదివాను. ఈ డిగ్రీతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఏమేం ఉంటాయి?

Updated : 06 Dec 2021 06:25 IST

దూరవిద్యలో సోషియాలజీ డిగ్రీ చదివాను. ఈ డిగ్రీతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఏమేం ఉంటాయి?

- శ్రీకాంత్‌ యాదవ్‌

* సోషియాలజీ డిగ్రీ అర్హతతో ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఏమీ లేవు. కానీ, డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ మీరు అర్హులే. డిగ్రీ అర్హతతో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌, బ్యాంకింగ్‌ రిక్రూట్‌మెంట్‌, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌, ఎల్‌ఐసీ, కేంద్రప్రభుత్వ, రాష్ట్రప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాలన్నింటికీ మీకు అర్హత ఉంటుంది.

ప్రైవేటురంగం విషయానికొస్తే డిగ్రీ అర్హత ఉన్న అన్ని ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేయవచ్చు. స్వచ్ఛంద సంస్థల్లో, పత్రికా రంగంలో, కౌన్సెలింగ్‌ రంగంలో ఉద్యోగాలకు సోషియాలజీ చదివినవారికి ఎక్కువ అవకాశాలుంటాయి. జర్నలిజం, పరిశోధన, మానవ వనరుల నిర్వహణలకు సంబంధించిన వృత్తుల్లో సోషియాలజీ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. మీరు డిగ్రీతోనే చదువు ఆపివేయకుండా సోషియాలజీ/ సోషల్‌ వర్క్‌/ జర్నలిజం/ సైకాలజీ/ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేస్తే ఉద్యోగావకాశాలు ఇంకా మెరుగవుతాయి. మీరు సోషియాలజీ డిగ్రీ తర్వాత, ఎల్‌ఎల్‌బీ కూడా చేసే అవకాశం ఉంది. బోధనరంగంలో ఆసక్తి ఉంటే బీఈడీ కూడా చేయవచ్చు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని