ఏజీ బీఎస్సీ చదివాక...

సాధారణంగా ఏజీ బీఎస్సీ చదివిన తరువాత ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే చాలామంది ఎంఎస్సీ అగ్రికల్చర్‌ చదువుతారు. మరికొంతమంది బయోటెక్నాలజీ. ప్లాంట్‌ సైన్సెస్‌, జెనెటిక్స్‌, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, అగ్రికల్చర్‌

Updated : 13 Dec 2021 06:29 IST

బీఎస్సీ (అగ్రికల్చర్‌) ఆనర్స్‌ తర్వాత దేశ విదేశాల్లో లభించే ఉన్నత విద్యావకాశాల గురించి తెలుపగలరు.

- యు. ప్రవీణ్‌ తేజ

సాధారణంగా ఏజీ బీఎస్సీ చదివిన తరువాత ఉన్నత విద్యను అభ్యసించాలనుకొనే చాలామంది ఎంఎస్సీ అగ్రికల్చర్‌ చదువుతారు. మరికొంతమంది బయోటెక్నాలజీ. ప్లాంట్‌ సైన్సెస్‌, జెనెటిక్స్‌, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, అగ్రికల్చర్‌ కెమిస్ట్రీ, అగ్రికల్చరల్‌ ఎకనమిక్స్‌, అగ్రికల్చరల్‌ ఎక్స్‌ టెన్షన్‌, ఆగ్రోనమి, ఎంటెమాలజీ లాంటి సబ్జెక్టుల్లో పీజీ చేస్తారు. ఇటీవలికాలంలో చాలామంది బీఎస్సీ అగ్రికల్చర్‌ చదివాక ఎంబీఏలో అగ్రిబిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు గురించీ ఆలోచిస్తున్నారు. ఇక విదేశాల్లో ఉన్నత విద్యావకాశాల విషయానికొస్తే- పైన పేర్కొన్న అన్ని కోర్సులతో పాటు, విభిన్న కోర్సులు చదివే అవకాశం ఉంది. ఉదాహరణకు- క్రాప్‌ సైన్సెస్‌, సాయిల్‌ సైన్స్‌, అగ్రికల్చర్‌ టెక్నాలజీ, గార్డెన్‌ డిజైన్‌, సస్టెయినబుల్‌ అగ్రికల్చర్‌, ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌, ఫుడ్‌ సెక్యూరిటీ లాంటి వినూత్న కోర్సులతో పాటు మరెన్నో మల్టీ డిసిప్ల్లినరీ కోర్సులు కూడా పూర్తిచేసుకోవచ్చు. పీజీ తరువాత, పీహెచ్‌డీ కూడా చేసినట్లయితే, బోధన, పరిశోధన రంగాల్లో ఉన్నత ఉద్యోగావకాశాలు పొందవచ్చు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని