ఎంఏ ఇంగ్లిష్‌ చదివితే...

డిగ్రీ చేశాను. ఎంఏ ఇంగ్లిష్‌ చదవాలనుకుంటున్నాను. ఈ పీజీతో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? 

Updated : 20 Dec 2021 06:28 IST

డిగ్రీ చేశాను. ఎంఏ ఇంగ్లిష్‌ చదవాలనుకుంటున్నాను. ఈ పీజీతో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?  - ఎ. బుచ్చయ్య

ఎంఏ ఇంగ్లిష్‌ కోర్సుకు ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది. ఈ పీజీతో  ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో ఆంగ్లం బోధించవచ్చు. ఎంఏ ఇంగ్లిష్‌ తరువాత నెట్‌/ సెట్‌ పరీక్షలో ఉత్తీర్ణులయితే డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా స్థిరపడవచ్చు. ఈ భాషలో పీహెచ్‌డీ చేసి విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం పొందవచ్చు. ఎంఏ ఇంగ్లిష్‌తో పాటు బీఈడీ చేసి పాఠశాలల్లో ఇంగ్లిష్‌ టీచర్‌ ఉద్యోగాలకోసం ప్రయత్నించవచ్చు. ప్రైవేటు రంగంలో కంటెంట్‌ రైటర్లుగా, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ సంస్థల్లో ఇన్‌స్ట్రక్టర్‌గా, అనువాదకునిగా, ఎడిటర్‌గా, కాపీ రైటర్‌గా, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌గా, టెక్నికల్‌ రైటర్‌గా విభిన్న ఉద్యోగావకాశాలు ఉన్నాయి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


కెరియర్‌, ఉన్నతవిద్యలకు సంబంధించి మీకు ఏ సందేహాలుఉన్నా వాటిని మాకు పంపండి. నిపుణులు సమాధానాలు ఇస్తారు.
మా చిరునామా: చదువు, ఈనాడు కార్యాలయం,
అనాజ్‌పూర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం,
రామోజీ ఫిల్మ్‌సిటీ - 501 512 edc@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని