ఐఏఎస్‌ అవ్వాలంటే...

మెడికల్‌ స్టూడెంట్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావడం సాధ్యమేనా? ఎంబీబీఎస్‌ చదువుతూనే యూపీఎస్‌సీ పరీక్షలు రాయొచ్చా?

Updated : 03 Jan 2022 06:47 IST

మెడికల్‌ స్టూడెంట్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావడం సాధ్యమేనా? ఎంబీబీఎస్‌ చదువుతూనే యూపీఎస్‌సీ పరీక్షలు రాయొచ్చా?

- ఎ. వీరభద్రం

* వైద్యవిద్యార్థులు ఐఏఎస్‌ ఆఫీసర్లు కావడం సాధ్యమే. 1980వ సంవత్సరంలోనే మన తెలుగువారైన డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ సివిల్స్‌ పోటీలో అఖిల భారత స్థాయి 4వ ర్యాంకుతో ఐఏఎస్‌ సాధించారు. 2021లో వరంగల్‌కి చెందిన డాక్టర్‌ శ్రీజ అఖిల భారత స్థాయిలో 20వ ర్యాంకుతో ఐఏఎస్‌ సాధించారు. ఎంబీబీస్‌ చదువుతూ యూపీఎస్‌సీ పరీక్ష రాయడం కుదరదు. యూపీఎస్‌సీ పరీక్ష రాయాలంటే ఏదైనా డిగ్రీ పూర్తవ్వాలి. కానీ, మీరు ఎంబీబీఎస్‌ చదువుతూనే, యూపీఎస్‌సీ పరీక్షకు సన్నద్ధంకండి. ప్రణాళికాబద్ధ్దమైన  శిక్షణ, కృషి, పట్టుదల ఉంటే ఎవరైనా కచ్చితంగా ఐఏఎస్‌ సాధించగలరు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని