దక్ష్‌ రోబో ప్రత్యేకత ఏమిటి?

  మనిషి లాంటి ప్రవర్తన, నడక, చర్మం కలిగిన రోబోలను ఏమని పిలుస్తారు?

Published : 09 Jan 2020 00:03 IST

టీఎస్‌పీఎస్సీ పరీక్షలు

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

మాదిరి ప్రశ్నలు

1. మనిషి లాంటి ప్రవర్తన, నడక, చర్మం కలిగిన రోబోలను ఏమని పిలుస్తారు?

1) ఆండ్రాయిడ్‌ రోబో 2) సింథటిక్‌ హ్యుమన్‌

3) బయోనిక్‌ మ్యాన్‌ 4) పైవన్నీ

2. ఇస్రో రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాల ద్వారా తీసిన భూమికి సంబంధించిన చిత్రాలను ఏమంటారు?

1) భువన్‌ 2) అనుసంధాన్‌

3) రిమోట్‌ పిక్చర్స్‌ 4) శాటిలైట్‌ పిక్చర్స్‌

3. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ ప్రారంభించిన టెలిమెడిసిన్‌ ప్రాజెక్టు వల్ల కలిగే లాభం?

1) దూర ప్రాంతాల వారికి వైద్యవిద్యను అందించడం

2) దూర ప్రాంతాలకు ఔషధాలను అందించడం

3) దూర ప్రాంతాలకు వైద్య సేవలు అందించడం

4) దూర ప్రాంతాలకు వైద్యులను పంపడం

4. డీఆర్‌డీవో, ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ కలిసి అభివృద్ధి చేసిన క్షిపణి వ్యవస్థను ఏమంటారు?

1) యాంటీ శాటిలైట్‌ మిస్సైల్‌ సిస్టం

2) బరాక్‌ మిస్సైల్‌ సిస్టం

3) యాంటీ ట్యాంక్‌ సిస్టం

4) యాంటీ వెహికిల్‌ సిస్టం

5. భారత రక్షణ దళాల వద్ద ఉన్న C-130J సూపర్‌ హెర్కులస్‌ విమానాల ప్రత్యేకత?

1) అణుబాంబులను వేయగలవు

2) క్షిపణులను ప్రయోగించగలవు

3) ఎక్కువ దూరం వెళ్లగలవు

4) ట్యాంకులు, సైనికులను తీసుకెళ్లగలవు

6. భారతదేశం స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన బోఫోర్స్‌ గన్‌ను ఏమని పిలుస్తున్నారు?

1) అశ్విన్‌ 2) పృథ్వి 3) ధనుష్‌ 4) ఆకాశ్‌

7. భారతదేశంలో ఏ నగరానికి మొదటి క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పరిచారు?

1) ముంబయి 2) దిల్లీ 3) బెంగళూరు 4) చెన్నై

8. స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన మొదటి సూపర్‌ కంప్యూటర్‌?

1) అనుపమ్‌ 2) విక్రమ్‌ - 100

3) పరమ్‌ పద్మ 4) పరమ్‌ - 8000

9. పుణెలోని ఏ పరిశోధనా సంస్థ భారతదేశంలో మొదటి సూపర్‌ కంప్యూటర్‌ను అభివృద్ధి చేసింది?

1) సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌

2) నేషనల్‌ కంప్యూటర్‌ ల్యాబొరేటరీ

3) కంప్యుటేషనల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ

4) నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ

10. డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన దక్ష్‌ రోబో ప్రత్యేకత ఏమిటి?

1) నీటి అడుగున ప్రయాణించగలదు

2) శత్రు శిబిరాలపై బాంబులను వేయగలదు

3) బాంబుల నుంచి సైనికులకు రక్షణ కల్పిస్తుంది

4) శత్రువుల కదలికలను గమనిస్తుంది

11. విశాఖపట్నంలోని నావల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ సంస్థ రూపొందించిన టార్పిడో పేరు?

1) మారీచ్‌ 2) అర్జున్‌ 3) శక్తి 4) వరుణాస్త్ర

12. డీఆర్‌డీవో సుజలాం ప్రాజెక్టు ద్వారా ఏ సాంకేతికతను అభివృద్ధి పరిచింది?

1) ఉప్పునీటిని మంచినీటిగా మార్చడం

2) భూగర్భ నీటిని శుద్ధిచేయడం

3) వర్షపు నీటిని నిల్వ చేయడం

4) మురుగు నీటిని శుభ్రపరచడం

సమాధానాలు: 1-4; 2-1; 3-3; 4-2; 5-4; 6-3; 7-2; 8-4; 9-1; 10-3; 11-4; 12-1.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని