మండలి సభ్యుల అనర్హతను ఎవరు ప్రకటిస్తారు?

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 169లో పేర్కొన్న శాసనమండలికి సంబంధించి కిందివాటిలో సరికానిది?

Updated : 27 Feb 2020 03:21 IST

శాసనమండలి

సచివాలయ పోస్టుల పరీక్షలు - ఇండియన్‌ పాలిటీ

1. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 169లో పేర్కొన్న శాసనమండలికి సంబంధించి కిందివాటిలో సరికానిది?
1) దీన్ని ఎగువసభ, విధానపరిషత్‌ అంటారు.
2) సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాలు.
3) ఇది శాశ్వత సభ.
4) దీనికి గవర్నర్‌ 1/6వ వంతు సభ్యులను నామినేట్‌ చేస్తారు.

2. రాష్ట్ర శాసనసభ (విధాన సభ) ఏ మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే పార్లమెంటు సాధారణ మెజార్టీతో సంబంధిత రాష్ట్రంలో కొత్తగా శాసనమండలిని ఏర్పాటుచేయడం లేదా ఉన్నదాన్ని తొలగించడం చేయగలదు?
1) 2/3        2) 1/3      3) 1/2         4) 1/4

3. ప్రతి రెండేళ్లకు ఒకసారి శాసనమండలిలో ఎంతమంది పదవీ విరమణ చేస్తారు?
1) 1/4        2) 1/2      3) 1/3        4) 2/3

4. శాసనమండలి సభ్యుల ఎన్నికకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
1) 1/3వ వంతు సభ్యులు ఎంఎల్‌ఏల ద్వారా ఎన్నికవుతారు.
2) 1/12వ వంతు సభ్యులు ఉపాధ్యాయుల ద్వారా ఎన్నికవుతారు.
3) 1/3వ వంతు సభ్యులు స్థానిక సంస్థల ప్రతినిధుల ద్వారా ఎన్నికవుతారు.
4) 1/3వ వంతు పట్టభద్రుల ద్వారా ఎన్నికవుతారు.

5. కింద పేర్కొన్న ఏ రాష్ట్రంలో శాసనమండలి లేదు?
1) బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌      2) కర్ణాటక, మహారాష్ట్ర        3) తెలంగాణ          4) తమిళనాడు

6. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో శాసనమండలిని తొలిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1956     2) 1957    3) 1958    4) 1960

7. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలికి తొలి ఛైర్మన్‌గా ఎవరు వ్యవహరించారు?
1) మాడపాటి హనుమంతరావు     2) కల్లూరి సుబ్బారావు
3) రొక్కం లక్ష్మీనరసింహం దొర    4) జి.ఎన్‌. రాజు

8. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో శాసనమండలిని ఎప్పుడు రద్దు చేశారు?
1) 1984      2) 1985     3) 1986       4) 1987

9. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి. రామారావు హయాంలో శాసనమండలిని తొలగించే సమయంలో దాని ఛైర్మన్‌గా ఎవరు వ్యవహరించారు?
1) సయ్యద్‌ ముఖ్‌సిర్‌షా        2) చక్రపాణి
3) కుతూహలమ్మ              4) రుద్రరాజు పద్మనాభం

10. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే శాసనమండలి సభ్యుల అనర్హతను ఎవరు ప్రకటిస్తారు?
1) ముఖ్యమంత్రి               2) ఎన్నికల సంఘం
3) శాసనమండలి ఛైర్మన్‌       4) శాసనసభ స్పీకర్‌

- బంగారు సత్యనారాయణ

సమాధానాలు: 1-2; 2-1; 3-3; 4-4; 5-4; 6-3; 7-1; 8-2; 9-1; 10-3.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని