మహాత్ముడికి స్ఫూర్తినిచ్చిన మహోన్నత వ్యక్తి
రత్నాల వ్యాపారం చేసే రామచంద్ర భాయి లావాదేవీల్లో భాగంగా ఒకసారి మరో వ్యాపారితో బేరం కుదుర్చు కున్నాడు. ఒక తేదీని నిర్ణయించుకుని, అప్పటిలోగా ఎంపిక చేసుకున్న రత్నాలను రామచంద్రకు ఇవ్వాలనేది ఆ ఒప్పందం. అతను కొంత సొమ్మును ముట్టజెప్పారు.
రత్నాల వ్యాపారం చేసే రామచంద్ర భాయి లావాదేవీల్లో భాగంగా ఒకసారి మరో వ్యాపారితో బేరం కుదుర్చు కున్నాడు. ఒక తేదీని నిర్ణయించుకుని, అప్పటిలోగా ఎంపిక చేసుకున్న రత్నాలను రామచంద్రకు ఇవ్వాలనేది ఆ ఒప్పందం. అతను కొంత సొమ్మును ముట్టజెప్పారు. అందుకు ఒప్పంద పత్రాలు రాసుకున్నారు. అయితే ఊహించని విధంగా కొద్దిరోజుల్లో రత్నాల ధర ఎంతగా పెరిగిందంటే, ఒప్పందం ప్రకారం రత్నాలను రామచంద్ర భాయికి అందజేస్తే రెండో వ్యక్తి దివాలా తీయక తప్పదు.
పెరిగిన రత్నాల ధర గురించి తెలిసిన రామచంద్ర వెళ్లగా ఆ వ్యాపారి కంగారు పడుతూ ‘రండి! రండి! నేను కూడా మీకు ఇవ్వాల్సిన రత్నాల విషయమే ఆలోచిస్తున్నాను. నా ఆర్థిక పరిస్థితి కుదుట పడగానే, మీకు రత్నాలు ముట్టజెబుతాను. నా మాటపై విశ్వాసం ఉంచండి’ అన్నాడు. అప్పుడు రామచంద్రభాయి ‘మిత్రమా! మనం రాసుకున్న ఒప్పందపత్రమే కదా నిన్ను కంగారుపెడుతున్నది! అదే లేదనుకో వివాదానికి తావుండదు కదా?!’ అంటూ ఆ పత్రం తెమ్మన్నాడు.
రామచంద్ర భాయి నష్టపోవటం ఆ వ్యాపారికీ ఇష్టం లేక పత్రం ఇవ్వనన్నాడు. ఎంతో నచ్చజెప్పిన మీదట ఇవ్వగానే రామచంద్ర దాన్ని చింపేశాడు. ‘మీ పరిస్థితి అర్థం చేసుకోగలను. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు. మీరిచ్చే పాలు తాగుతాను. కానీ రక్తం కాదు. మీరు ఇవ్వగలిగినప్పుడే రత్నాలు ఇవ్వండి’ అన్నాడు రామచంద్ర భాయి. ఆ మహానుభావుడి సహృదయానికి చలించిపోయిన వ్యాపారి. ‘మీరు మనిషి కాదు, భగవంతుడు’ అన్నాడు.
మహాత్మాగాంధీని ‘మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులెవరు? అని ఓ విలేకరి అడిగినప్పుడు ‘రామచంద్ర భాయి.. ఆయన నాకు గురువుతో సమానం!’ అని బదులిచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: యువకులు కాదు.. యమడేంజర్లు!
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Dhruv Chopper Fleet: ధ్రువ్ హెలికాప్టర్లకు క్లియరెన్స్ పునరుద్ధరించిన సైన్యం
-
General News
CM KCR: విప్రహిత బ్రాహ్మణ సదన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
India News
ఇకపై OTTలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు.. కేంద్రం కీలక నిర్ణయం
-
World News
South Korea: కిమ్ ఉపగ్రహ ప్రయోగం.. దక్షిణ కొరియాపై ప్రజల ఆగ్రహం..!