Marriage: ధర్మబద్ధ జీవనానికి

వివాహం ఒక సత్సంప్రదాయంగా కొనసాగు తోంది. ఇది అందరూ అనుసరించదగిన సదాచారమన్నారు పెద్దలు.

Published : 30 Mar 2023 00:17 IST

వివాహం ఒక సత్సంప్రదాయంగా కొనసాగు తోంది. ఇది అందరూ అనుసరించదగిన సదాచారమన్నారు పెద్దలు. పెళ్లి శారీరక, మానసిక ప్రశాంతతను ప్రసాదించడమే కాదు, కుటుంబ జీవనాన్ని పటిష్టంగా ఉంచుతుంది. అందుకే మన వివాహ వ్యవస్థ ఆదర్శప్రాయమైందంటూ ప్రపంచమంతా కీర్తిస్తుంది.

ఒక స్త్రీకి ఒక పురుషుడు అన్న నిబంధనతో పెళ్లి పద్ధతిని ప్రారంభించారు మన పూర్వీకులు. వివాహం అనగానే ఒక ఇంటివారవుతున్నారు అంటారు. అందాకా ఇల్లు లేదని కాదు. కానీ వారికంటూ కుటుంబం ఏర్పడుతుంది. అదో గుర్తింపు, గౌరవం. ముఖ్యంగా మాటలకందని అనుబంధం. కష్టంలో, సుఖంలో ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండే తోడు దొరుకుతుంది. అన్నిటినీ మించి వివాహంతో ధర్మసాధన సాధ్యమవుతుంది.

వివాహం కేవలం కామ్య కర్మ కాదు. మన పురోభివృద్ధికి, ఆరోగ్యవంతమైన జాతి నిర్మాణానికి, సమైక్య భావనకు, మహోదాత్తమైన అనుబంధాలకు తోడ్పడుతుందంటూ మన పురాణ ఇతిహాసాలు సిద్ధాంతీకరించాయి. ఆధ్యాత్మికతకు ఆలంబన అయిన వివాహ వ్యవస్థ త్రేతాయుగంలోనే ఆరంభమయ్యింది. అంటే ధర్మబద్ధ జీవనం సాగించేందుకు వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆచారమిది.

గోవిందం ఉమామహేశ్వర రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని