భయమెందుకు?

ఒక ధనవంతుడు తన భవనానికి కాపలా కోసం ఖర్చు లేని ఉపాయాన్ని ఆలోచించాడు. భవంతి ఎదుట గొలుసులతో బంధించిన కుక్క శిల్పాన్ని పెట్టించాడు.

Published : 29 Dec 2022 00:21 IST

ఒక ధనవంతుడు తన భవనానికి కాపలా కోసం ఖర్చు లేని ఉపాయాన్ని ఆలోచించాడు. భవంతి ఎదుట గొలుసులతో బంధించిన కుక్క శిల్పాన్ని పెట్టించాడు. శిల్పి ఆ శునక విగ్రహాన్ని ఎంత అద్భుతంగా చెక్కాడంటే చూపరులు నిజమైన కుక్క అనుకుని భయపడి పారిపోయేవారు. ఒకరోజు ఓ వ్యక్తి భవనం ముందు నుంచి వెళ్తూ శునకశిల్పం చూసి హడలిపోయాడు. ఇరుగుపొరుగువారు విషయం చెప్పి భయం పోగొట్టారు. అతడు ఆశ్చర్యపోయి శిల్పి చాతుర్యాన్ని మెచ్చుకున్నాడు. నిజమైన కుక్కేమోనని భ్రాంతిలో ఉన్నంతసేపూ భయపడ్డాడు. కాదని జ్ఞానోదయమయ్యాక స్వరూప జ్ఞానంతో భయం తొలగింది. అందుకే భయానికీ, దుఃఖానికీ గల కారణాలేంటో అన్వేషించాలి, ఆధ్యాత్మిక సాధనతో వాటిని నివారించాలి- అంటారు రమణమహర్షి.

మయూఖ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని