సహ్యాద్రి శ్రేణుల్లో శాంభవీ శక్తి!
మహారాష్ట్రలోని నాసిక్ ప్రఖ్యాత ఆధ్మాత్మిక కేంద్రం. ఇక్కడి త్య్రంబక జ్యోతిర్లింగ దర్శన యాత్ర గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. గోరారాం, కాలారాం, తపోవన్ గంగా మందిర్, సోమేశ్వర, నౌషా గణపతి ఆలయం తదితర దేవస్థానాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్న మరో గొప్ప ఆలయం సప్తశృంగి మాత నిలయం...
దర్శనీయం
మహారాష్ట్రలోని నాసిక్ ప్రఖ్యాత ఆధ్మాత్మిక కేంద్రం. ఇక్కడి త్య్రంబక జ్యోతిర్లింగ దర్శన యాత్ర గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. గోరారాం, కాలారాం, తపోవన్ గంగా మందిర్, సోమేశ్వర, నౌషా గణపతి ఆలయం తదితర దేవస్థానాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్న మరో గొప్ప ఆలయం సప్తశృంగి మాత నిలయం. నాసిక్ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఒక పర్వతంపై ఈ ఆలయం ఉంది. సముద్ర మట్టానికి 4800 అడుగుల ఎత్తులో ఈ మాత స్వయంభువుగా వెలసిందని ప్రతీతి. ఈ ఆలయానికి ఒకవైపు లోతైన లోయలు... మరోవైపు ఎత్తైన కొండలు భక్తుల ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మికతను రెట్టింపుచేస్తాయి. వని (వనం) అని పేరొందిన ఈ శక్తిపీఠం నిత్యం వేలాది యాత్రికులతో కళకళలాడుతుంటుంది. భీమాసురుడు అనే రాక్షసుణ్ణి మట్టుబెట్టాలన్న మార్కండేయ మహర్షి ప్రార్థనతో అమ్మ ఇక్కడ ఏడు శక్తుల కలయికతో అవతరించిందని చెబుతారు. పద్దెనిమిది రకాల ఆయుధాలతో, ఎనిమిది అడుగుల ఎత్తులో, సింధూర వర్ణంలో దర్శనమిచ్చే మాత దివ్యానుభూతిని కలిగిస్తుంది. ఆలయానికి వెళ్లాలంటే 475 మెట్లు ఎక్కాలి. లేదంటే ప్రతి 10 నిమిషాలకు ఉండే రోప్ ట్రైన్ ద్వారా అమ్మవారి ముంగిట్లో వాలొచ్చు. భక్తులకు భోజన సరఫరాకు అనేక స్టాళ్లు ఉంటాయి.
- జి.జగదీశ్వరి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!