నీకు కిరీటం...అప్పుడు!
ఇది పోటీ ప్రపంచం. ప్రతి విషయంలోనూ ప్రత్యర్థులు ఎదురవుతారు. అది ఒక పోటీ పరీక్ష కావచ్చు, లేదా ఒక ఆటలో....
క్రీస్తువాణి
ఇది పోటీ ప్రపంచం. ప్రతి విషయంలోనూ ప్రత్యర్థులు ఎదురవుతారు. అది ఒక పోటీ పరీక్ష కావచ్చు, లేదా ఒక ఆటలో గెలుపొందడానికి చేసే క్రీడా పరీక్ష కావచ్ఛు అదే క్రమంలో ఒక వృత్తిలో రాణించదలచిన వారు తమ నైపుణ్యాలు పెంచుకోవాలి. దీనికోసం కష్టపడాలి. పోరాటం చేయాలి. మరి ఆ పోరాటం చేసే వ్యక్తి ఎలా ఉండాలి? విజేతలు కావాల్సిన వాళ్లకు ఎలాంటి శిక్షణ అవసరం? దీనికి క్రీస్తు చెప్పిన సందేశం ఇది...
‘పందెంలో పోరాడే ప్రతివాడూ అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. బహుమానం పొందేలా పరుగెడతాడు’.. ఇది అన్ని కాలాలకు, అందరికీ అనుసరణీయం. పోటీలో ఉన్న వాళ్లు సంయమనంతో ఉండాలి. విజయం కోసం ఓర్పుతో నిరీక్షించాలి. పోరాడే సమయంలో అలసట కలగొచ్ఛు ఆయాసం రావచ్ఛు ఓడిపోతామనే భయం కలగొచ్ఛు... అలాగే అతిశయం కూడా ఉండొచ్ఛు కానీ దేనికీ అతిగా లోనుకావద్దని అంటారు ప్రభువు. అన్ని భావావేశాల్లోనూ మితంగా ఉండాలంటారాయన. సంశయం లేకుండా, సంతోషంగా, స్వాభిమానంతో ముందుకు సాగేవారికి కిరీటం దొరుకుతుంది. నిర్మలంగా, నిబద్ధతతో పోరాటం చేయమంటున్నారు క్రీస్తు.
- ఎం.సుగుణరావు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ