సాంకేతిక బ్రహ్మ!
ఈ సృష్టి అంతా బ్రహ్మ చేతిలో రూపుదిద్దుకుంది. అది మూల పదార్థం మాత్రమే. అందులో మనిషి మనుగడకు అవసరమైన అనేక...
ఈనెల 17 విశ్వకర్మ జయంతి
ఈ సృష్టి అంతా బ్రహ్మ చేతిలో రూపుదిద్దుకుంది. అది మూల పదార్థం మాత్రమే. అందులో మనిషి మనుగడకు అవసరమైన అనేక రూపాలను సృష్టించే వాడు కార్మికుడు. ఆయన అనేక సంకేతాల ద్వారా పరికరాలను తయారు చేస్తాడు కాబట్టి అతణ్ణి ‘సాంకేతిక నిపుణుడు’ అంటారు. ఆ నైపుణ్యాలకు ఆద్యుడు ‘విశ్వకర్మ’.
వేద పురుషుడు: రుగ్వేదం పదమూడో మండలం 81, 82 సూక్తాలు విశ్వకర్మ గురించి విపులంగా చెబున్నాయి. అధర్వణ వేదం ఆయనను ‘ఆహార ప్రదాత’గా పేర్కొంది. పురుషసూక్తం విశ్వకర్మను విరాట్పురుషుడిగా పేర్కొంది. ఇన్ని రకాలుగా ప్రశంసలు అందుకోడానికి ఆయన శ్రమతత్త్వం, సాంకేతిక ఔన్నత్యం కారణాలు. ఇతడు దేవతలకు కావలసిన నగరాలు, రథాలు, ఆయుధాలన్నిటినీ నిర్మించి ఇచ్చేవాడు. దేవతల కోసం స్వర్గాన్ని నిర్మించింది ఆయనే అని, ద్వాపరయుగంలో ద్వారక, ఇంద్రప్రస్థం, కలియుగంలో హస్తినాపురం నగరాలను నిర్మించిన వాడు విశ్వకర్మే అని పురాణాల్లో ఉంది. మయసభను ఈయన కుమారుడైన మయుడు నిర్మించాడంటారు.
సుదర్శన చక్రం అలా తయారైంది... సాంకేతిక పరిజ్ఞానమనే మాట ఈనాటిది కాదు. వేదకాలం నుంచి ఉంది. దాన్ని మొదట ఉపయోగించినవాడు విశ్వకర్మ. ఆ పరిజ్ఞానంతోనే విష్ణుమూర్తి ఆయుధాల్లో ముఖ్యమైన సుదర్శన చక్రాన్ని తయారు చేశాడు. దానికి కారణం ఆయన కూతురు సౌంజ్ఞాదేవి. ఆమెను సూర్యుడికిచ్చి పెళ్లిచేశాడు విశ్వకర్మ. సూర్యుడి తేజస్సుని భరించలేని ఆమె భర్తను విడిచి వచ్చేసింది. కారణం తెలుసుకున్న విశ్వకర్మ తన నైపుణ్యంతో సూర్యుడిలో లోకావసరాలకు మించి ఉన్న తేజస్సుని తగ్గించాడు. ఆ సమయంలో వచ్చిన తేజోమయమైన సూర్య రజనుతో, తన సాంకేతిక చాతుర్యంతో చక్రంగా తయారుచేసి శ్రీ మహావిష్ణువుకి బహూకరించాడు. సాంకేతిక పరిజ్ఞానమంటే అదీ. |
వారంతా ఆయన సంతానమే మనువు, మయుడు, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు ఆయన సంతానం. వారు ఇనుము, కర్ర, కాంస్య, శిల్ప, స్వర్ణకారులుగా ప్రసిద్ధులయ్యారు. వారి కారణంగానే మానవుల అవసరాలకు కావాల్సిన సామగ్రి అంతా సమకూరుతోంది. లోకానికి ఇంత మహోపకారం చేసిన విశ్వకర్మను అందరూ పూజించాలని నిశ్చయించుకున్నారు. ఆ విషయం తెలిసిన ఆయన ‘పూజించాల్సింది వ్యక్తిని కాదు శక్తిని... మీ వృత్తికి, భుక్తికి కారణమైన పనిముట్లను పూజించాల’ని ఆదేశించాడు. అలా చేస్తే నన్ను పూజించినట్టే భావిస్తానని బోధించాడు. అప్పటి నుంచి కార్మికులంతా తమ వృత్తులకు సంబంధించిన పరికరాలనే విశ్వకర్మగా భావించి పూజించసాగారు.
భాద్రపద మాసంలో వచ్చేది కన్యా సంక్రమణం. ఇది విశ్వకర్మ జన్మించిన రోజు. అందుకే ఆయన జన్మదినాన ఆయన పేరుతో తమ పరికరాలను, యంత్రాలను, కర్మాగారాలను పూజిస్తారు.
- రమా శ్రీనివాసరావు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Postal Jobs: పోస్టల్లో 30,041 ఉద్యోగాలు.. రెండో షార్ట్‌లిస్ట్ ఇదిగో!
-
Janasena: ‘ఎందుకు ఆంధ్రాకు జగన్ వద్దంటే..’: జనసేన పొలిటికల్ కార్టూన్
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Crime News: ఎన్సీఆర్బీ పేరిట ఫేక్ మెసేజ్.. విద్యార్థి ఆత్మహత్య.. ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముంది?
-
Maneka Gandhi: మేనకా గాంధీపై ఇస్కాన్ రూ.వంద కోట్ల పరువు నష్టం దావా
-
Kriti Sanon: సినిమా ప్రచారం కోసం.. రూ. 6 లక్షల ఖరీదైన డ్రెస్సు!