చందన వెంకన్న!

వేంకటేశ్వరస్వామి ఆలయాలు ఎన్నున్నా వాడపల్లి ఎంతో ప్రత్యేకమైంది. ఈ దివ్యస్థలంలో వేంకటేశ్వరుడు కొయ్య విగ్రహంగా దర్శనమిస్తాడు. ఎర్రచందనం చెక్కతో మలిచినందున ఈ స్వామిని చందన స్వరూపుడిగా భావిస్తారు. ఇలాంటి విగ్రహం దేశంలో ఎక్కడా లేదని చెబుతారు...

Published : 10 Oct 2019 00:36 IST

దర్శనీయం

వేంకటేశ్వరస్వామి ఆలయాలు ఎన్నున్నా వాడపల్లి ఎంతో ప్రత్యేకమైంది. ఈ దివ్యస్థలంలో వేంకటేశ్వరుడు కొయ్య విగ్రహంగా దర్శనమిస్తాడు. ఎర్రచందనం చెక్కతో మలిచినందున ఈ స్వామిని చందన స్వరూపుడిగా భావిస్తారు. ఇలాంటి విగ్రహం దేశంలో ఎక్కడా లేదని చెబుతారు. రాజమహేంద్రవరానికి 30 కిలోమీటర్ల దూరంలో గౌతమీ తీరాన, పచ్చని ప్రకృతి ఒడిలో ఉందీ ఆలయం. క్షేత్రవిశేషం ప్రకారం చాలా ఏళ్ల క్రితం ఈ గ్రామంలోని ఒక వృద్ధుడికి వేంకటేశ్వర స్వామి కలలో కనిపించి కృష్ణ గరుడపక్షి వాలినచోట ఓ చందన పేటిక దొరుకుతుందని చెప్పాడు. ఆయన మంగళవాయిద్యాలతో వెళ్లి స్వామి చెప్పిన చోట ఉన్న పేటికను శిల్పితో  తెరిపించారు. అందులో శంఖు, చక్ర, గదలతో స్వామి దివ్య మంగళ విగ్రహం కనిపించింది. ఆ స్వామిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. వాడపల్లి వెంకన్నను తలచుకుని, ఏదైనా సంకల్పం చేసుకుంటే తప్పక నెరవేరుతుందని అంటారు. ప్రతి శనివారం జరిగే ఏడువారాల నోము ప్రసిద్ధి చెందింది. ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.


- ఆత్మాల వెంకట రామారావు, ఆత్రేయపురం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని