ధర్మసందేహం

శివుడికి కార్తికమాసం ప్రీతిపాత్రమని చెప్తారు. శివుడు చంద్రుడి తపస్సుకు మెచ్చి అతణ్ణి అనుగ్రహించాడు. చంద్రుడు తన పదహారు కళలలో ఒకటి పరమేశ్వరుడికి సమర్పించగా, ఆ కళను తలపై ధరించి ఆయన సోమశేఖరుడయ్యాడు.

Published : 31 Oct 2019 00:17 IST

కార్తిక సోమవారం ఎందుకు ప్రత్యేకం

- లత, నిజామాబాద్‌

శివుడికి కార్తికమాసం ప్రీతిపాత్రమని చెప్తారు. శివుడు చంద్రుడి తపస్సుకు మెచ్చి అతణ్ణి అనుగ్రహించాడు. చంద్రుడు తన పదహారు కళలలో ఒకటి పరమేశ్వరుడికి సమర్పించగా, ఆ కళను తలపై ధరించి ఆయన సోమశేఖరుడయ్యాడు. సోమ శబ్దానికి చంద్రుడు అనే అర్థంతోపాటు ఉమతో కూడినవాడు అనే అర్థంకూడా ఉంది. అంటే అర్ధనారీశ్వరుడు. ఆ పేరుతో ఉన్న సోమవారం, అది కూడా కార్తిక సోమవారం శివుడికి ప్రీతిపాత్రమై ప్రసిద్ధి పొందింది. కార్తిక సోమవారం నాడు నదీస్నానం, దీపారాధన, దీపదానం, ఉపవాసం, శివార్చన, రుద్రాభిషేకం భక్తితో నిర్వహించాలని పెద్దలు చెబుతారు

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని