ధర్మ సందేహం

వివాహిత ఎప్పుడైనా పుట్టింటికి వస్తే.. తిరుగు ప్రయాణం మంగళ, శుక్రవారాల్లో చేయకూడదనే అభిప్రాయం వ్యాప్తిలో ఉంది. ఈ రెండు వారాలు లక్ష్మీదేవి స్థానాలు. పుట్టింట్లో ఆడపిల్లదీ లక్ష్మీదేవి స్థానమే.

Published : 14 Nov 2019 00:26 IST

పుట్టింటికి వచ్చిన ఆడపిల్ల మంగళ, శుక్రవారాల్లో తిరుగు ప్రయాణం చేయకూడదా?

- వనజ, ఒంగోలు

వివాహిత ఎప్పుడైనా పుట్టింటికి వస్తే.. తిరుగు ప్రయాణం మంగళ, శుక్రవారాల్లో చేయకూడదనే అభిప్రాయం వ్యాప్తిలో ఉంది. ఈ రెండు వారాలు లక్ష్మీదేవి స్థానాలు. పుట్టింట్లో ఆడపిల్లదీ లక్ష్మీదేవి స్థానమే. అందువల్ల ఈ రెండు రోజుల్లో ఆడపిల్ల అత్తగారింటికి బయల్దేరకూడదని ప్రచారమైంది.
అనివార్యంగా అదే రోజు బయల్దేరాల్సి వస్తే.. ముందు రోజు గడప బయట ఒక సంచిని ఉంచుతుంటారు. తర్వాతి రోజు బయల్దేరిన ఆడపిల్ల ఆ సంచిని తీసుకొని వెళ్తే దోషం ఉండదని పెద్దల అభిప్రాయం.
వివాహం అయిన ఆడపిల్ల 14 ఏళ్లు పుట్టింటికి దూరంగా ఉండి తర్వాత వెళ్లాల్సి వస్తే పరిహారాలు చేయించాలని చాలామంది భావిస్తుంటారు. కానీ ఎలాంటి పరిహారాలూ అవసరం లేదు. దీనికి శాస్త్ర ఆధారాలు లేవు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని