షష్ఠి వేడుక చేస్తున్నారా?

మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని ‘సుబ్రహ్మణ్య షష్ఠి’ అంటారు. దేవతల సేనకు నాయకత్వం వహించి సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం చేసింది ఈ రోజేనని చెబుతారు. కుమారస్వామి, స్కందుడు, శరవణభవుడు అని సుబ్రహ్మణ్యుడికి పేర్లు.

Published : 28 Nov 2019 02:07 IST

మీకోసం
డిసెంబరు 2 సుబ్రహ్మణ్య షష్ఠి

మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని ‘సుబ్రహ్మణ్య షష్ఠి’ అంటారు. దేవతల సేనకు నాయకత్వం వహించి సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం చేసింది ఈ రోజేనని చెబుతారు. కుమారస్వామి, స్కందుడు, శరవణభవుడు అని సుబ్రహ్మణ్యుడికి పేర్లు.
* కుమారస్వామికి ఆరు ముఖాలు. కనుక షణ్ముఖుడని కూడా పేరు. ఐదు ఇంద్రియాలు, మనస్సులకు ఈ ఆరు ముఖాలూ సంకేతాలు. అలాగే యోగ సాధనలోని షట్చక్రాలకు ఈ ఆరు ముఖాలూ ప్రతీకలు.
* సుబ్రహ్మణ్యుడు జ్ఞాన స్వరూపుడు. సుబ్రహ్మణ్య ఆరాధన యోగబలాన్ని, ఆరోగ్యఫలాన్ని, సంతానప్రాప్తినీ అనుగ్రహిస్తుంది.
* సుబ్రహ్మణ్య షష్ఠినాడు పేదలకు దుప్పట్లు, కంబళ్లు దానం చేసే ‘ప్రావరణ వ్రతం’ నిర్వహించాలని పెద్దలు చెప్తారు. ప్రావరణం అంటే కప్పి ఉంచడం. చలికాలంలో వచ్చే ఈ పర్వదినాన పేదల చలి బాధను నివారించే వ్రతంలోని ఆంతర్యం చాలా గొప్పది. సాటివారి బాధలను గురించి ఆలోచించటమే ‘జ్ఞానం’ అని మన పెద్దలు పరోక్షంగా సూచిస్తున్నారు.  ఈ పర్వదినాన సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించి, ఆ రూపంగా ఒక బ్రహ్మచారికి భోజనంపెట్టి, వస్త్రాలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి గౌరవించడం సంప్రదాయం.
* కుండలినీ యోగస్వరూపుడు సుబ్రహ్మణ్యుడని నమ్మి సర్పాకారంలో పూజిస్తారు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు