కాలభైరవుడి చిత్రపటం ఇంట్లో ఉంచుకోవచ్చా?

కాలభైరవుడి చిత్రం ఇంట్లో నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. ఎలాంటి దోషం లేదు. విగ్రహాన్నీ పూజగదిలో ఉంచి పూజించుకోవచ్చు. కాలభైరవుడిదనే కాదు.....

Published : 26 Dec 2019 00:46 IST

- వెంకటలక్ష్మి, హైదరాబాద్‌

ధర్మసందేహం

కాలభైరవుడి చిత్రం ఇంట్లో నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. ఎలాంటి దోషం లేదు. విగ్రహాన్నీ పూజగదిలో ఉంచి పూజించుకోవచ్చు. కాలభైరవుడిదనే కాదు.. ఇంట్లో ఉండే ఏ దేవతా విగ్రహాల పరిమాణమైనా నాలుగు అంగుళాలకు మించరాదు. విగ్రహాలు పెట్టుకున్నప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరి. వాటికి నిత్య ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాల్సి ఉంటుంది. నిష్ఠగా ఉండాలి. ఆచారాలు పాటించాలి.  ఈ నియమాల ఆచరణలో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొనే ఇంట్లో విగ్రహాలు వద్దని పెద్దలు సూచించారు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని