పై చేయి మీదైతే!

యాచన కన్నా అడవి నుంచి కట్టెల మోపు మోసుకొచ్చి అమ్ముకొని తినడం ఎంతో మేలన్నది ప్రవక్త సందేశం. కొందరు ప్రజలు దైవ ప్రవక్త (స) దగ్గరకు వచ్చి కొంత ధనం కావాలని అడిగారు...

Published : 26 Dec 2019 00:46 IST

ఇస్లాం సందేశం

యాచన కన్నా అడవి నుంచి కట్టెల మోపు మోసుకొచ్చి అమ్ముకొని తినడం ఎంతో మేలన్నది ప్రవక్త సందేశం. కొందరు ప్రజలు దైవ ప్రవక్త (స) దగ్గరకు వచ్చి కొంత ధనం కావాలని అడిగారు. ప్రవక్త వారికి ధనం ఇచ్చారు. కానీ వారు మళ్లీ అడిగారు. రెండోసారి కూడా ఇచ్చారు. ఇలా ఇస్తూ పోయారు. చివరికి ఆయన దగ్గర ఉన్నదంతా అయిపోయింది. అప్పుడాయన ఇలా అన్నారు నా దగ్గరున్న ధనసంపద ఎంతయినా మీకివ్వడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. మీకు ఇవ్వకుండా నేను ఏదీ దాచుకోను, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. యాచించకుండా ఉండేవాడికి దేవుడు అది తీసుకునే పరిస్థితి రాకుండా కాపాడతాడు. ఎప్పుడూ ఆశించనివారికి దేవుడు లెక్కలేనంత ప్రసాదిస్తాడు. దైవానుగ్రహాల్లో సహనానికి మించిన మహాభాగ్యం లేదు. దైవప్రవక్త(స)కు ఎవరైనా ఆహార పదార్థాలు సమర్పిస్తున్నప్పుడు ఇది దానంగా ఇస్తున్నావా లేక కానుకగా ఇస్తున్నావా? అని అడిగేవారు. అతను గనక ఆ వస్తువుని దానంగా ఇస్తున్నానని చెబితే దైవప్రవక్త దాన్ని ముట్టుకునేవారు కాదు. ఒకవేళ అతను ఆ వస్తువుని కానుకగా ఇస్తున్నానని అంటే మాత్రం దైవప్రవక్త (స) దాన్ని స్వీకరించి, ఇతరులను కూడా కలుపుకొని తినేవారు. చెమటోడ్చి సంపాదించడాన్ని ప్రవక్త మహనీయులు ప్రశంసించేవారు. ఇచ్చే చేయి... పుచ్చుకునే చేయికన్నా మిన్న అన్నది ప్రవక్త (స) సందేశం.
  - ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని