... అలా ఉంటామంటే కుదరదు!
జైలంటే.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా.. నాలుగు గోడల మధ్య గడపాలి. కఠిన నిబంధనలకు తలొగ్గాలి. జైలు జీవితాన్ని ఎవరైనా కోరుకుంటారా? కానీ...
ఇస్లాం సందేశం
జైలంటే.. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా.. నాలుగు గోడల మధ్య గడపాలి. కఠిన నిబంధనలకు తలొగ్గాలి. జైలు జీవితాన్ని ఎవరైనా కోరుకుంటారా? కానీ, ‘ఈ ప్రాపంచిక జీవితం విశ్వాసికి చెరశాల వంటిద’న్నారు మహాప్రవక్త ముహమ్మద్ (సఅసం). ఒక విశ్వాసి తన జీవితాన్ని ఎలా గడపాలో? ఒక్క వాక్యంలో వివరించారు. మనసులోని కోరికలను జైలు జీవితం గడుపుతున్న ఖైదీలా హద్దుల్లో ఉంచుకోవాలి. ఇష్టారాజ్యంగా బతుకుతానంటే కుదరదు. ఈ జైలులో ప్రతి నిమిషం ప్రభువు మెప్పునే గీటురాయిగా తీసుకోవాలి. మనసును అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలి. నడక, నడత అల్లాహ్ మెచ్చేలా ఉండాలి. దైవ శాసనమే పరమావధిగా జీవనం సాగించాలంటారు ప్రవక్త మహనీయులు. ప్రభువు ప్రసన్నతే పరమావధిగా భావించాలని సూచించారు. అధికారం, హోదా, డబ్బు ఉందన్న అహంకారంతో ప్రాపంచిక జీవితాన్ని విచ్చలవిడిగా గడిపిన వారు.. పరలోకంలో శాశ్వత చెరశాలలో బందీలుగా ఉండాల్సి వస్తుంది. దైవాజ్ఞను ఉల్లంఘించని విశ్వాసులు మహనీయులవుతారు.
- ఖైరున్నీసాబేగం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!