నోటిపై నిఘా పెట్టండి!

ఒక వ్యక్తి దైవ ప్రవక్త (స) దగ్గరకు వచ్చి ‘ఓ స్త్రీ ఎన్నెన్నో నమాజులు చేస్తుంది. ఉపవాసాలూ పాటిస్తుంది. దానధర్మాలు చేస్తుంది.

Published : 20 Feb 2020 00:04 IST

ఇస్లాం సందేశం

ఒక వ్యక్తి దైవ ప్రవక్త (స) దగ్గరకు వచ్చి ‘ఓ స్త్రీ ఎన్నెన్నో నమాజులు చేస్తుంది. ఉపవాసాలూ పాటిస్తుంది. దానధర్మాలు చేస్తుంది. కానీ ఆమె తన నోటి ద్వారా పొరుగువారి మనస్సు కష్టపెడుతుంది’ అని అన్నాడు. దానికి దైవప్రవక్త ‘అయితే ఆమె నరకానికి పోతుంది’ అన్నారు. తిరిగి ఆ వ్యక్తి ఇలా అన్నాడు... ‘దైవ ప్రవక్తా; మరో మహిళ చాలా అరుదుగా అదనపు నమాజులు, ఉపవాసాలు పాటిస్తుంది. చాలా తక్కువగా దానధర్మాలు చేస్తుంది. అయితే ఆమె తన మాటలతో ఎవరినీ కష్టపెట్టదు’. ఇది విన్న ప్రవక్త ‘ఆమె స్వర్గ నివాసి అవుతుంది’ అన్నారు. దురుసుగా మాట్లాడటం, దుర్భాషలు పలకడం తీవ్రమైన పాపాలు. అలా చేసేవారిని దేవుడు అసహ్యించుకుంటాడు అన్నారు ప్రవక్త. దొంగ సాక్ష్యాలు చెప్పడం, ఇతరులను కించపరుస్తూ మాట్లాడటం, వదంతులు వ్యాపింప చేయడం, రెండు నాల్కల ధోరణితో మాట్లడటం, పరోక్ష నిందలు ఇవన్నీ నాలుక చేసే పాపాలు. అందుకే నోటిపై నిత్యం నిఘా ఉంచాలి. ముందూ వెనుకా ఆలోచించి మాట్లాడాలి.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని