వర్ణమా వందనం!

రంగు రంగులో కళ... ప్రతి రంగుకో లక్ష్యం, ఓ అవసరం ఉన్నాయి. అవి మనిషి ఆధ్యాత్మికతకు, ఔన్నత్యానికి కూడా కారణమవుతాయి. అందుకే మనిషి

Published : 05 Mar 2020 00:42 IST

ఈనెల 9 హోలీ

రంగు రంగులో కళ... ప్రతి రంగుకో లక్ష్యం, ఓ అవసరం ఉన్నాయి. అవి మనిషి ఆధ్యాత్మికతకు, ఔన్నత్యానికి కూడా కారణమవుతాయి. అందుకే మనిషి ప్రకృతిలోని వర్ణాలను చూసి పరవశమవుతాడు, ఉత్తేజం పొందుతాడు. ఆ రంగుల్లోని దైవత్వానికి ప్రణమిల్లుతాడు. ●

* సృష్టిలోని అన్నీ శూన్యంలోంచే ఉద్భవిస్తున్నాయి. అందుకే అన్ని రంగులకూ నలుపును మూలంగా భావిస్తారు. ఈ రంగు చెడు శక్తులను ఆకర్షించి తనలో లీనం చేసుకుంటుంది.

* అత్యంత ప్రశాంతతకు, అత్యున్నత తాత్త్వికతకు తెలుపు నిదర్శనం. ఈ వర్ణంలో ఉన్న స్వచ్ఛత ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి కారణమవుతుందని చెబుతారు.●

* సృష్టికి రజోగుణమే కారణం. అలాంటి రజోగుణానికి ఎరుపు సూచిక. అందుకే ఈ రంగును సృజనాత్మతకు నిదర్శనంగా భావిస్తారు.●

* నీలిరంగు దివ్యత్వానికి నిదర్శనం. ఇది ఏకాగ్రతను కుదుర్చుతుందని చెబుతారు. గాఢమైన, ప్రశాంతమైన మనస్థితికి ఇది కారణమవుతుందంటారు. రుషులు

* తపోస్థలిగా అడవులను, పచ్చటి ప్రాంతాలను ఎంచుకోడానికి కారణం ఆకుపచ్చ రంగు. ఇది ఎదుగుదలకు చిహ్నం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని