పంచాంగం వింటున్నారా?

శ్రీ కల్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిద ముత్తమం శుచికరం సంతాన

Published : 19 Mar 2020 00:09 IST

శ్రీ కల్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిద ముత్తమం శుచికరం సంతాన సంపత్పద్రం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతామ్‌ అని శాస్త్ర వచనం.

ఉగాదినాడు కొత్త పంచాంగాన్ని పూజించి, పంచాంగ శ్రవణం చేయటం ప్రధానమైన అంశం. పంచాంగం అంటే ఐదు అంశాలతో కూడినది. వరాహ మిహిరుడు తన బృహత్‌ జాతక మొదటి శ్లోకంలో జ్యోతిష శాస్త్రాన్ని సంసార సాగరం దాటడానికి ఉపయోగించే దిక్సూచి అని పేర్కొన్నాడు. అంటే జ్యోతిషం లేదా పంచాంగం అనేవి కాలాన్ని తెలియజేసే మార్గదర్శి అని అర్థం చేసుకోవాలి. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు అనే ఐదింటికీ సంబంధించిన కాలపురుషుడి కదలికలను, తత్ఫలితాలనూ తెలియచేసేది పంచాంగం. సంపదల విషయంలో తిథిని, ఆయు రారోగ్యాల విషయంలో వారాన్ని, పాపసంకల్పాలు రాకుండా ఉండే విషయంలో నక్షత్రాన్ని, రోగనిరోధకశక్తిని పెంపొందించుకునే విషయంలో యోగాన్ని, తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా నెరవేరటానికి కరణాన్ని గమనించాలని శాస్త్రం చెప్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు