ప్రాణాలను పరిశీలిస్తున్నారా?

ఉచ్ఛ్వాస నిశ్వాసాలే మనిషికి ప్రాణాధారం. అలాంటి శ్వాసనకు ఏమాత్రం ఆటంకం కలిగినా మనిషి ...

Published : 02 Apr 2020 00:06 IST

చ్ఛ్వాస నిశ్వాసాలే మనిషికి ప్రాణాధారం. అలాంటి శ్వాసనకు ఏమాత్రం ఆటంకం కలిగినా మనిషి నిస్తేజుడవుతాడు. నిర్జీవుడవుతాడు. మనలో ప్రాణ, వ్యాన, సమాన, అపాన, ఉదాన అనే అయిదు వాయువులు ఉంటాయి. వీటినే పంచప్రాణాలని అంటారు. వీటితో పాటు నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయమనే మరో అయిదు ఉప ప్రాణ వాయువులు కూడా శరీర రథం కదలికలకు కారణమవుతాయి. వీటిని క్రమబద్దం చేసేందుకు వేద, ఉపనిషత్‌, శాస్త్రాలు నిర్దేశించిన ప్రక్రియ ప్రాణాయామం. దీని వల్ల శారీరకంగా ఎన్నో మాలిన్యాలు సమసిపోతాయి. ‘ప్రాణాయామైర్దహేర్దోషాన్‌’... ప్రాణాయామం శరీరంలోని ఎన్నో దోషాలను దహించివేస్తుందని యాజ్ఞవల్క్య మహర్షి అని తేల్చిచెప్పారు. తద్వారా శరీరానికి నిశ్చలత్వం అలవడుతుంది. అది మనిషికి రోగనిరోధక శక్తిని, సవాళ్లను ఎదుర్కొనే సామర్ధ్యాన్ని ఇస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని