జీవ భావన నుంచి ఆత్మవైపు...

సర్వసాధారణంగా పవిత్రకార్యాల విషయంలో చూపుడు వేలు నిషేధించారు పెద్దలు. దైవారాధన...

Published : 21 May 2020 00:10 IST

ధర్మ సందేహం

జపమాలకు చూపుడు వేలు తాకకూడదు అంటారు ఎందుకు?

- నవీన్‌, బెంగళూరు

ర్వసాధారణంగా పవిత్రకార్యాల విషయంలో చూపుడు వేలు నిషేధించారు పెద్దలు. దైవారాధన, మంత్రజపమూ పవిత్రమైన హృదయంతో సాగాలని, ఆ క్రియ కూడా అంతే శుద్ధిగా ఉండాలనేది వారి అభిప్రాయం. వేదాంత సంప్రదాయంలో చూపుడు వేలు జీవాత్మకు ప్రతీక. జీవభావన నుంచి ఆత్మ భావనకు చేసే ఆధ్యాత్మిక ప్రయాణమే సాధన. మంత్ర జపం లక్ష్యం అదే. అందువల్ల జప సమయంలో జపలమాలకు చూపుడు వేలు తాకకుండా చేయమన్నారు. జీవభావన విడిచి దైవచింతనతో కూడిన మనస్సుతో చేసే మంత్రజప సాధన మాత్రమే సత్ఫలితాన్నిస్తుంది. ఈ భావానికి సంకేతంగా చూపుడు వేలును నిషేధించారు.

-మల్లాప్రగడ శ్రీమన్నారాయణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు