అది కాదు ముఖ్యం!

మరణించిన తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? మరణానికి సంబంధించిన రహస్యం ఏమిటంటూ ఓ రోజున శిష్యుల్లో ఒకరు బుద్ధుడిని అడుగుతారు. అందుకు బుద్ధుడు చిన్నగా నవ్వుతూ ఇలా అడుగుతాడు... బాణం తగిలి నీ చేతికి గాయం అయిందనుకో.

Published : 05 Nov 2020 01:00 IST

బోధి వృక్షం

రణించిన తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉంటుంది? మరణానికి సంబంధించిన రహస్యం ఏమిటంటూ ఓ రోజున శిష్యుల్లో ఒకరు బుద్ధుడిని అడుగుతారు. అందుకు బుద్ధుడు చిన్నగా నవ్వుతూ ఇలా అడుగుతాడు... బాణం తగిలి నీ చేతికి గాయం అయిందనుకో. అప్పుడు నువ్వేం చేస్తావు. బాణం తొలగించాలనుకుంటావా? లేక ఆ బాణం ఎక్కడ నుంచి వచ్చిందో వెతకాలనుకుంటావా? ముందు బాణం తీయటానికి ప్రయత్నం చేస్తాను. లేకపోతే అందులోని విషం నా శరీరమంతా వ్యాపిస్తుంది అంటూ సమాధానం చెప్పాడా శిష్యుడు. భేష్‌... నీ సమాధానం చాలా గొప్పది. నువ్వే కాదు ఎవరైనా సరే ఈ పనే చేస్తారు. ప్రపంచంలోని ఏదైనా సమస్యకు ముందు పరిష్కారం ఆలోచించాలి. వ్యక్తి మరణించిన తర్వాత ఈ ప్రపంచం ఏమవుతుందోనని సందేహం అనవసరం అన్నాడు బుద్ధుడు. గురువు అంతరంగాన్ని గ్రహించాడు శిష్యుడు. అర్థమైందంటూ వినయంగా నమస్కరించాడు. శిష్యుడు జిజ్ఞాసను బుద్ధుడు అభినందించాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని