అలాంటి వారికి ప్రవేశం లేదు!

ఓ పండితుడు ‘నువ్వెప్పుడైనా మృగాలను చూశావా’ అని తన శిష్యుడిని అడిగాడు. ‘‘రోజూ చూస్తూనే ఉంటాం కదండీ’ అని గురువు గారికి  జవాబిచ్చాడు. అలా వారిద్దరి మధ్య మొదలైన సంభాషణ కొనసాగిందిలా.. ‘సరే నీవెప్పుడైనా మన లోపల ఉండే మృగాన్ని చూశావా’

Updated : 05 Nov 2020 02:08 IST

ఇస్లాం సందేశం

పండితుడు ‘నువ్వెప్పుడైనా మృగాలను చూశావా’ అని తన శిష్యుడిని అడిగాడు.
‘‘రోజూ చూస్తూనే ఉంటాం కదండీ’ అని గురువు గారికి  జవాబిచ్చాడు. అలా వారిద్దరి మధ్య మొదలైన సంభాషణ కొనసాగిందిలా..
‘సరే నీవెప్పుడైనా మన లోపల ఉండే మృగాన్ని చూశావా’
‘లోపలి మృగమా అదెలా ఉంటుంది’

‘కోపంతో ఎదుటివారిమీద కేకలు వేయడం, అసూయతో రగిలిపోవడం, మనసు కోరే కోరికలను అక్రమంగా తీర్చుకోవడం ఇవన్నీ మనలో ఉండే మృగాలే’ అయితే ఈ పశువులను మన కళ్లు తెరిచి ప్రత్యక్షంగా చూడలేము. ఈ మృగాలను చూడాలంటే మనం కళ్లు మూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మన వ్యక్తిత్వం ఎలాంటిదో కళ్లముందు ప్రత్యక్షమవుతుంది.

ఈ దుర్లక్షణాలన్నీ మనలోకి వచ్చినప్పుడు మనిషి పశువులా ప్రవర్తిస్తాడు. అందరూ  తలదించుకునేలా దిగజారతాడు.

మనిషి వ్యక్తిత్వం అంటే బాహ్య, ఆంతర్యాల కలయికే మనిషి. ఇంద్రియాలు, అవయవాలన్నీ మనిషికి భౌతిక రూపం. మనిషి లోపల ఉండే మంచి, చెడు భావాలనే ఆంతర్యం అంటారు. మన దేహానికి అంటుకునే దుర్గంధం ఎంతగా వెగటుగా ఉంటుందో అంతరంగానికి అంటుకునే దుర్గంధమూ అంతే వెగటుగా ఉంటుంది. గర్వాతిశయంతో విర్రవీగడం, కళ్లెంలేని కోరికలకు దాసోహమవడం, అసూయ ద్వేషాలు, దురాలోచనలు, కుళ్లు, కుతంత్రాలు, కుట్రలు ఇవన్నీ మనసును మలినం చేసే దుర్గంధాలే! మనసును అదుపులో పెట్టుకోవడంవల్ల, కల్మషం లేని ఆలోచనలతో, దైవ విదేయతతో మనసును ఎన్నో మలినాలనుంచి పవిత్రంగా కాపాడుకోవచ్చు.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని