అందమైన రేయి...

ముహమ్మద్‌ ప్రవక్త (స) ప్రియ సహచరులు హజ్రత్‌ అబూబకర్‌ సిద్దీఖ్‌ తన దగ్గర పనిచేసే ఒక సేవకుడి గాథను ఇలా వివరించారు...

Published : 17 Dec 2020 01:04 IST

ఇస్లాం సందేశం

ముహమ్మద్‌ ప్రవక్త (స) ప్రియ సహచరులు హజ్రత్‌ అబూబకర్‌ సిద్దీఖ్‌ తన దగ్గర పనిచేసే ఒక సేవకుడి గాథను ఇలా వివరించారు...

నా దగ్గర ఒక యువకుడు పని చేసేవాడు. నమాజులు, రోజాలు పాటించడంలో ఏలోటూ రానిచ్చేవాడు కాదు. ఎంతో ధర్మనిష్ఠాపరుడు. ఒకరోజు అతను నాదగ్గరకొచ్చి రాత్రి తాను కన్న కలను గురించి వివరించాడు. ‘‘తహజ్జుద్‌ నమాజు చేయలేకపోయాను. రాత్రి నేనొక కలగన్నాను. ఆ కలలో మస్జిదు లోపలి భాగంలోని గోడ రెండుగా చీలిపోయింది. అందులోనుంచి స్వర్గలోకపు కన్యలు మెరుస్తూ బయటికొస్తున్నారు. వారిలో ఒకామె అంద వికారంగా ఉంది. చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తోంది. ఈ ఘటన నన్నెంతగానో ఆశ్చర్యపరిచింది.

నేను ఉండబట్టలేక ‘మీరంతా ఎవరూ?’ అని అడిగాను. ‘మేమంతా నువ్వు తహజ్జుద్‌ నమాజు చేసిన రాత్రులం.’ అని చెప్పారు. ఆ తరువాత అందవికారంగా ఉన్న ఆమె వంక చూపించి... ‘ఈమె ఈరోజు రాత్రి’ అని చెప్పారు. తహజ్జుద్‌ నమాజు గొప్పతనమేంటో అప్పుడు అర్థమైంది . అతనికి. రాత్రి మూడోజామున లేచి చేసే నమాజును తహజ్జుద్‌ నమాజు అంటారు.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని