అలా చూడొద్దు!

ఒకానొక మహిళ చేతిలో పళ్లెంలో ఏవో పదార్థాలు తీసుకెళుతోంది. పళ్లెంపై ఏదో గుడ్డ కప్పి ఉండటంతో పళ్లెంలో ఏముందో తెలుసుకోవాలన్న కుతూహలం అటుగా వెళుతున్న ఓ పండితుడికి కలిగింది. ‘అమ్మా ఈ పళ్లెంలో

Published : 24 Dec 2020 01:39 IST

ఇస్లాం సందేశం

ఒకానొక మహిళ చేతిలో పళ్లెంలో ఏవో పదార్థాలు తీసుకెళుతోంది. పళ్లెంపై ఏదో గుడ్డ కప్పి ఉండటంతో పళ్లెంలో ఏముందో తెలుసుకోవాలన్న కుతూహలం అటుగా వెళుతున్న ఓ పండితుడికి కలిగింది. ‘అమ్మా ఈ పళ్లెంలో ఏముంది’ అని అడిగారాయన. ‘ఇందులో ఉన్నదేమిటో చెప్పదలుచుకున్నప్పుడు ఇలా కప్పి తీసుకెళ్లాల్సిన అవసరమేముంది’ అని బదులివ్వడంతో పండితుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఆమె చెప్పిన మాటల్లో జీవితానికి పనికొచ్చే చిట్కాలున్నాయి.
‘ఏదైనా వస్తువు, మాట రహస్యంగా ఉంచదలిచినప్పుడు దాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేయకూడదన్న నిగూడార్థం ఇందులో ఉంది. ఒకరి వెంట పడి వారి లోపాలను, బలహీనతలను బహిర్గతం చేయరాదన్న సందేశం ఇందులో ఉంది. ప్రతి ఒక్కరిలో మంచి, చెడు అలవాట్లుంటాయి. మనం మన చెడ్డ అలవాట్లు, లోపాలు ఒకరిముందు బహిర్గతం కాకుండా జాగ్రత్తపడతాము. పైనున్న ఆ దేవుడు మనలోని ఆ దుర్గుణాలపై పరదా కప్పి మన గౌరవ మర్యాదలను కాపాడతాడు. ఒకవేళ అంతరంగంలో మనం చేసే తప్పులు, పొరపాట్లు, చెడ్డ పనులు అన్నీ బహిర్గతమైతే ఒకరినొకరం అసహ్యించుకుంటాం. అందుకే ఒకరి లోపాలు వెతుక్కుంటూ, వారిని అభాసుపాలు చేసే చిల్లర పనులు మానుకోవాలి అంటారు పెద్దలు.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని