అటునుంచి నరుక్కు వచ్చేలోగాఅమరకోశం ఆవిర్భవించింది!

చదువులమ్మ సరస్వతీదేవి చెప్పినట్లుగా ఓ మాట విశేష ప్రచారంలో ఉంది. అమరం చదవని వారికి నేను అమరను... అనేది ఆమాట. అమరం అంటే అమరకోశం. దీన్ని రాసింది అమరసింహుడు. ఆ కవి తన గ్రంథానికి

Published : 04 Feb 2021 00:41 IST

తెలుసుకుందాం

దువులమ్మ సరస్వతీదేవి చెప్పినట్లుగా ఓ మాట విశేష ప్రచారంలో ఉంది. అమరం చదవని వారికి నేను అమరను... అనేది ఆమాట. అమరం అంటే అమరకోశం. దీన్ని రాసింది అమరసింహుడు. ఆ కవి తన గ్రంథానికి నామలింగ శాసనం అనే పేరు పెట్టినా, అమరకోశం అనే పేరు స్థిరపడింది. ఇది ఈనాటికీ సంస్కృత భాషకు సంబంధించిన అత్యుత్తమ నిఘంటువుగా, సరస్వతీ దేవి అనుగ్రహంతో వచ్చినట్లుగా చెబుతారు. దేవతా సంబంధమైన పదాల అర్థాలకు నిధిగా అమరకోశం ప్రకాశిస్తోంది. ఇంతటి ఉద్గ్రంథాన్ని రచించిన అమరసింహుడికి సంబంధించి ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది.
అమరసింహుడు బౌద్ధాన్ని అనుసరించేవాడు. ఓ వైదిక రాజు బౌద్ధులను రూపుమాపాలని నిర్ణయించుకున్నాడు. వందలాది మందిని వరసలో ఉంచి అందరి తలలనూ నరకమన్నాడు. తలారి అమరసింహుడి దగ్గరకు రాగానే అమరసింహుడు కాస్తంత అటు నుంచి నరుక్కురమ్మన్నాడు. సరేనన్న తలారి అటు నుంచి నరుక్కురావడానికి వెళ్లాడు. అతను తిరిగి తన దగ్గరకు వచ్చేలోగా నామలింగాను శాసనాన్ని వందలాది శ్లోకాలతో అమరసింహుడు చెప్పాడు. సరస్వతీ కటాక్షాన్ని సంపూర్ణంగా పొందిన వాడిగా అమరసింహుడిని చెబుతారు. నామలింగాను శాసనానికి లింగాభట్టు వ్యాఖ్యానం రచించాడు. అందుకే దీన్ని లింగాభట్టీయం అని కూడా అంటారు.

- యల్లాప్రగడ మల్లికార్జునరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని