ఉసిరి తెచ్చే ఆనందం!

ఏకాదశి అనే సంస్కృత పదానికి పదకొండవది అని అర్థం. శుక్లపక్షంలో వచ్చేదాన్ని శుక్ల లేదా శుద్ధ ఏకాదశి అని, కృష్ణ ఏకాదశి అని పిలుస్తారు. శార్వరి నామ సంవత్సరంలో ఇప్పటికే అనేకక శుక్ల, కృష్ణ ఏకాదశులు వచ్చివెళ్లాయి. ఇక మిగిలింది ఫాల్గుణ శుద్ధ ఏకాదశి, లేదా అమలక ఏకాదశి.

Published : 25 Mar 2021 01:40 IST

నేడు అమలైక ఏకాదశి

కాదశి అనే సంస్కృత పదానికి పదకొండవది అని అర్థం. శుక్లపక్షంలో వచ్చేదాన్ని శుక్ల లేదా శుద్ధ ఏకాదశి అని, కృష్ణ ఏకాదశి అని పిలుస్తారు. శార్వరి నామ సంవత్సరంలో ఇప్పటికే అనేకక శుక్ల, కృష్ణ ఏకాదశులు వచ్చివెళ్లాయి. ఇక మిగిలింది ఫాల్గుణ శుద్ధ ఏకాదశి, లేదా అమలక ఏకాదశి. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. అమలకం అంటే ఉసిరి. ఈ చెట్టుకు, శ్రీ మహా విష్ణువుకు  వీడని అనుబంధం ఉంది. ఔషధ గుణాలతో సమృద్ధమైన అమలకాన్ని సాక్షాత్తు నారాయణ స్వరూపంగా భావించే సంస్కృతి మనది. ఈ ఏకాదశి నాడు ఉసిరి చెట్టుకు, శ్రీ మహా విష్ణువుకు పూజలు చేస్తారు. ఒక ఉపవాసదీక్షగా మాత్రమే కాకుండా వ్రతంగా  జరుపుకోవడం ఉత్తరాదిలో కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో వ్రతం చేస్తే శుభకరమని ప్రజల విశ్వాసం. ఈ వ్రతం చేసినందు వల్ల పూర్వం చిత్రసేనుడనే మహారాజు అడవిలో ఆటవికుల చేతిలో బలికాకుండా బయటపడ్డాడని ఓ కథనం ఉంది.

- ఉప్పు రాఘవేంద్రరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని