ఖాళీ ఏదీ?

ఒక విశ్వవిద్యాలయ ఆచార్యుడు ఓసారి ప్రముఖ జెన్‌ గురువును కలిసేందుకు వెళ్లాడు. గురువు ఆదరపూర్వకంగా టీ ఒంపుతుంటే...

Published : 20 May 2021 00:22 IST

జెన్‌ కథ

క విశ్వవిద్యాలయ ఆచార్యుడు ఓసారి ప్రముఖ జెన్‌ గురువును కలిసేందుకు వెళ్లాడు. గురువు ఆదరపూర్వకంగా టీ ఒంపుతుంటే, ఆ ఆచార్యుడు ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాడు. జెన్‌ గురువు వాటిని శాంతంగా వింటూ ఆ ఆచార్యుడి కప్పు నిండా టీ ఒంపాడు. ఆ తర్వాత కూడా ఆపకుండా అలాగే టీ ఒంపుతూనే ఉన్నాడు. ఆ ఆచార్యుడు నివ్వెరపోయి చూస్తున్నాడు. రెండు క్షణాల తర్వాత ఇక ఆగలేక, ‘కప్పు పూర్తిగా నిండిపోయింది. ఇక అందులో టీ పట్టదు’ అని చెప్పాడు. వెంటనే ఆ గురువు మందహాసం చేస్తూ, ‘నువ్వు కూడా ఈ కప్పులాగే నిండుగా ఉన్నావు. ఇక నేను నీతో ఏం మాట్లాడగలను. ఏం చెప్పగలను’ అన్నాడు. ఆ ఆచార్యుడికి అసలు విషయం అర్థమై అపరాధ భావంతో తల దించుకున్నాడు. ఏదన్నా విషయం గురించి తెలుసుకోవాలంటే మన మనసు నిర్మలంగా ఉండాలి. ఆయా విషయాల గురించి ముందుగానే మనవైన అభిప్రాయాలతో మనసుని నింపేస్తే, కొత్తగా తెలుసుకోవటానికి ఆస్కారం ఉంటుందా?  

- ఎం.అక్షర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని