సత్యాత్మకే అర్చన!

భగవంతుడి దర్శనం గురించి రమణ మహర్షి ఒకసారి ఇలా చెప్పారు. ‘ద్వారానికి గర్భగుడి చాలా దూరంగా ఉంటుంది. భక్తుడు ఒక ప్రాకారం తర్వాత

Published : 24 Jun 2021 01:20 IST

గురుబోధ

గవంతుడి దర్శనం గురించి రమణ మహర్షి ఒకసారి ఇలా చెప్పారు. ‘ద్వారానికి గర్భగుడి చాలా దూరంగా ఉంటుంది. భక్తుడు ఒక ప్రాకారం తర్వాత మరొకటి దాటుతూ ముందుకు పోగా పోగా దేవుడి సన్నిధానానికి వచ్చే సరికి అతని హృదయంలో పావనత్వం, భక్తిభావం వెల్లివిరుస్తాయి. ప్రదక్షిణ చేసే ఉద్దేశం కూడా అదే. అంతేకాదు, దేవుని వైపు తిరిగి ‘స్వామీ, తండ్రీ, నమస్కారం’ అని సాష్టాంగ ప్రణామం చేసేటప్పుడు కళ్లు మూసుకుంటాం. దేవుడికి నమస్కరిస్తే కళ్లు ఎందుకు మూసుకోవటం? అంటే ఇక్కడ మనం ఎదురుగా ఉన్న విగ్రహానికి కాకుండా మనలోనే ఉన్న ఏదో ఒక రూపానికి మొక్కుతున్నాం. అలా మనం అజ్ఞాతంగా మనలోని సత్యాత్మకే అర్చన చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. అలాగే, ‘నేను’ అనేది ఏంటి? అది ఎక్కడ పుడుతుంది? అన్ని వస్తువుల్లో అది ఎలా ఉంటుంది?’ అని ఓ భక్తుడు రమణ మహర్షిని అడిగాడు. దానికి ఆయన ‘నేను అనేది ఏంటో, ఎక్కడ పుడుతుందో ఆ ‘నేను’నే అడిగిచూడు! నేను అన్నిటిలో ఉన్నాను అనటం అద్దం ప్రతిబింబంలో ఉందని చెప్పటం. వాస్తవం దానికి విరుద్ధం. అద్దంలో ప్రతిబింబం ఉన్నట్లు నిజమైన నేనులో అన్నీ ఉన్నాయి’ అని బోధించారు రమణులు.

- మానస పోతన


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని