కర్షక దిక్సూచి పునర్వసు

కర్షకుల సేద్యానికి చుక్కానిలా, కాలానికి కొలగీతగా నిలుస్తుంది కార్తె. ఆయా కార్తెల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులుంటాయో భారతీయ జ్యోతిషం, పంచాంగాలు వివరిస్తాయి.

Published : 01 Jul 2021 01:04 IST

ర్షకుల సేద్యానికి చుక్కానిలా, కాలానికి కొలగీతగా నిలుస్తుంది కార్తె. ఆయా కార్తెల్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులుంటాయో భారతీయ జ్యోతిషం, పంచాంగాలు వివరిస్తాయి. దీన్ని రైతన్నలు తమ అనుభవాలకు జోడించి సేద్యాన్ని సాగిస్తుండటం సంప్రదాయంగా వస్తోంది. సూర్యుడు పునర్వసు నక్షత్రంలో ప్రవేశించిన నాటి నుంచి పునర్వసు కార్తె (జులై 6 నుంచి) ప్రారంభమవుతుంది. అన్ని కార్తెల్లోకీ ఇది కాస్త ప్రత్యేకం. ఇందులో కురిసిన వర్షాన్ని అనుసరించి వ్యవసాయ పనులు జరుగుతుంటాయి. పునర్వసు నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, శకునాలు తదితర అంశాల ఆధారంగా ఆ సంవత్సరంలో కురిసే వర్షాన్ని అంచనా వేస్తుంటారు. ‘పునర్వసు, పుష్యాలకు పూరేడు గుత్తయినా/ పిట్ట అడుగైనా తడవదు’ లాంటి సామెతలు కొన్ని ఈ కార్తె నేపథ్యంగా పుట్టుకొచ్చాయి. అంటే, ఈ కార్తెలో వాన ముఖం చాటు చేస్తుందనే అర్థం బోధపడుతుంది.

- డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు