దృష్టినిబట్టే సృష్టి
ఒక గురువు దగ్గర ఇద్దరు శిష్యులుండేవారు. వారిలో ఒకరిది మంచి మనసు. మరొకరు దుష్టస్వభావి. ఒక రోజు ఆ గురువు దుష్టస్వభావం కలిగిన మనుషుల్ని వెతికి తెమ్మని సజ్జనుడికి, మంచి బుద్ధి కలిగిన వ్యక్తుల్ని
క్రీస్తువాణి
ఒక గురువు దగ్గర ఇద్దరు శిష్యులుండేవారు. వారిలో ఒకరిది మంచి మనసు. మరొకరు దుష్టస్వభావి. ఒక రోజు ఆ గురువు దుష్టస్వభావం కలిగిన మనుషుల్ని వెతికి తెమ్మని సజ్జనుడికి, మంచి బుద్ధి కలిగిన వ్యక్తుల్ని తీసుకురమ్మని దుష్టస్వభావికి చెప్పారు. వారిద్దరూ ఒట్టి చేతులతో తిరిగొచ్చారు. మంచివాడికి దుష్టులు కనిపించలేదు. దుష్టుడికి సజ్జనులెవరూ తారసపడలేదు. ఈ నేపథ్యంగా ‘మనం ఏమి విత్తుతామో దాన్నే కోసుకుంటాము’ అంటారు క్రీస్తు ప్రభువు. మంచితనం మూర్తీభవించిన మనిషికి అందరూ మంచివారిగానే కనిపిస్తారు. దృష్టిని బట్టే సృష్టి! ప్రపంచం సరిగా లేదనడం కాదు, అందులో మనం సరిగా ఉండాలి. అప్పుడే మనిషి సంపూర్ణ మానవుడిగా, మహోన్నతుడిగా మారతాడు. అలాగే ‘సాటి మనుషులు మీకేం చెయ్యాలని కోరుకుంటారో, మీరూ వారికి అలాగే చెయ్యండి’ అన్నది క్రీస్తు వాణి. పొరుగు వ్యక్తి నీకు హాని తలపెట్టాలని అనుకుంటావా? అలాగే నీ నుంచి అతడూ మంచిని, ప్రేమనే ఆశిస్తాడు. ప్రభువు చెప్పిన విశ్వ ప్రేమ సూత్రం, ‘నీలాగే పొరుగువారిని ప్రేమించడం’ ఇందులో కనిపిస్తుంది.
- ఎం.సుగుణరావు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..