ధర్మాన్ని వదలకు
శరీరాలు శాశ్వతం కాదు. సంపద కూడా స్థిరమైనది కాదు. మృత్యువు నీ వెన్నంటే ఉంటుందని నీకు తెలీదు. కనుక ధర్మాన్ని వదలకుండా ఆచరిస్తుండాలి అనేది ఈ శ్లోకానికి అర్థం.
జ్ఞానసారం
ఆశ లేనిదే జీవితం నిస్సారం. కానీ అది దురాశగా మారితే మాత్రం ఇతరులకు దుస్సహం. ఇతరులపై ఆవేశాలూ ఆక్రోశాలు చూపే బదులు దయగా, ఆదరంగా ఉండగలిగితే మన జన్మ ధన్యం కదా!
అనిత్యాని శరీరాణి విభవోనైవ శాశ్వతః
నిత్యం సన్నిహితో మృత్యుః కర్తవ్యో ధర్మసంగ్రహః
శరీరాలు శాశ్వతం కాదు. సంపద కూడా స్థిరమైనది కాదు. మృత్యువు నీ వెన్నంటే ఉంటుందని నీకు తెలీదు. కనుక ధర్మాన్ని వదలకుండా ఆచరిస్తుండాలి అనేది ఈ శ్లోకానికి అర్థం.
స్థిరంగా, శాశ్వతంగా ఉండని వాటిమీద వ్యామోహం అవసరమా?! అత్యాశ పాపభీతిని హరిస్తుంది. నీతినియమాలను ఉల్లంఘిస్తుంది. ఆ దురాశతోనే అడ్డదారుల్లో, దొడ్డిదారుల్లో ఆర్జన. అందులో భాగంగా అన్యాయాలూ అక్రమాలు. జీవితం క్షణభంగురమని మరచిపోతున్నారు. హిరణ్యకశిపుడు తన అధికారాన్ని గుర్తించలేదని, ఆజ్ఞని పాటించలేదని కన్నకొడుకు ప్రహ్లాదుని హతమార్చబోయి విష్ణువు చేతిలో హతుడయ్యాడు. రావణుడు సార్వభౌమాధికారం కోసం కాలకేయ రాజ్యంపై దండెత్తి చెల్లెలు శూర్పణఖ భర్తను చంపేశాడు. దుర్యోధనుడు పినతండ్రి కొడుకులైన పాండవులను, వారి తల్లి కుంతీదేవిని లక్కయింటిలో చంపాలని చూశాడు. చెల్లెలి కొడుకు చేతిలో చావు తప్పదని తెలుసుకున్న కంసుడు ఏడుగురు బిడ్డ్డలను పురిటిలోనే చంపాడు. ఎవరికి వారే క్రూరంగా ప్రవర్తించి చివరికి పతనమయ్యారు. నాటిన విత్తనాన్ని బట్టే మొక్క కనుక ఆగ్రహానికి బదులు అనుగ్రహాన్ని పంచితే సరి.
అప్పుడైనా, ఇప్పుడైనా ఇక ముందెప్పుడైనా చేసిన పాపాలకు పతనం తప్పదు. ‘అర్థం దుఃఖభాజనం’ అన్నారు. కనుక అధికార ధన దాహాలు దుఃఖానికే దారితీస్తాయి. ఉన్నదానితో సంతృప్తి చెందుతూ సాటి వ్యక్తులతో ప్రేమగా, దయగా ఉంటే అంతకంటే ఆనందం ఇంకేముంది?! జీవితం సుఖంగా, శాంతంగా గడచిపోతుంది.
- పారుపల్లి వెంకటేశ్వరరావు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!