ఆ బాధ్యత నాదే!

ప్రసిద్ధ జెన్‌ గురువు బాన్‌కీ ధ్యాన శిక్షణ తరగతులు జపాన్‌ వ్యాప్తంగా ఎంతో మందిని ఆకర్షించాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆయన దగ్గరికి వచ్చి శిక్షణ తీసుకునేవారు.

Updated : 29 Jul 2021 01:30 IST

జెన్‌ కథ

ప్రసిద్ధ జెన్‌ గురువు బాన్‌కీ ధ్యాన శిక్షణ తరగతులు జపాన్‌ వ్యాప్తంగా ఎంతో మందిని ఆకర్షించాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆయన దగ్గరికి వచ్చి శిక్షణ తీసుకునేవారు. ఆ తరగతుల్లో ఓ విద్యార్థి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. విషయం తెలిసిన బాన్‌కీ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కొద్ది రోజులయ్యాక అదే విద్యార్థి మళ్లీ ఇతరుల      వస్తువులు అపహరిస్తూ దొరికిపోయాడు. ఈసారీ గురువు చర్యలు తీసుకోలేదు. అది విద్యార్థులను మనస్తాపానికి గురి చేసింది. దొంగతనం చేసిన వ్యక్తిని వెంటనే పంపించెయ్యాలని, లేకుంటే తాము తరగతులు వదిలి వెళ్లిపోతామని బాన్‌కీకి లేఖ ద్వారా తెలియజేశారు. అది చదివిన ఆయన, ‘శిష్యులారా! మీరంతా తెలివైనవాళ్లు. ఏది మంచో ఏది చెడో మీకు తెలుసు. కానీ, ఇతనికి మంచీ చెడుల జ్ఞానం లేదు. వాటిని నేను తెలియజెప్పకపోతే, ఇంకెవరు బోధిస్తారు? అందుకే, అతణ్ని ఇక్కడే ఉంచాలని నిర్ణయించాను. కావాలంటే మీరు వెళ్లిపోవచ్చు అన్నారు. శిష్యులకు తమ అపరాధం   అర్థమై గురువుని క్షమాపణలు వేడుకున్నారు. బాన్‌కీ మాటలకి దొంగతనం చేసిన విద్యార్థి కళ్ల నుంచి అశృవులు జలజలా రాలాయి. ఆ తర్వాత మరెప్పుడూ అతను చోరీలు చెయ్యలేదు!

- దివ్యాన్షశ్రీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు