సజీవ దైవం

రామకృష్ణ పరమహంస మాధవ అనే శిష్యునితో కలిసి కాశీయాత్రకు బయల్దేరాడు. దారిలో వారికి అనేక అనుభవాలు ఎదురయ్యాయి. ఒకరోజు అలా నడచుకుంటూ వెళ్తుండగా ఆకలికి

Updated : 19 Aug 2021 01:52 IST

రామకృష్ణ పరమహంస మాధవ అనే శిష్యునితో కలిసి కాశీయాత్రకు బయల్దేరాడు. దారిలో వారికి అనేక అనుభవాలు ఎదురయ్యాయి. ఒకరోజు అలా నడచుకుంటూ వెళ్తుండగా ఆకలికి అలమటిస్తోన్న ఒక పేద కుటుంబం కనిపించింది. వాళ్లకి కొన్నాళ్లపాటు భోజనానికి లోటు లేకుండా కొంత ధనం ఇవ్వమని శిష్యునితో చెప్పాడు పరమహంస.

‘దారి పొడుగునా సాయాలు చేస్తున్నారు. ఉన్న సొమ్మంతా ఇలా ఖర్చయిపోతే మన యాత్ర ఎలా సాగుతుంది గురువర్యా? ఇక ప్రయాణం ఆపేసి మనమిక్కడే ఉండిపోవాల్సి వస్తుందేమో’ కొంచెం దిగులుగా అన్నాడు మాధవ.
పరమహంస ప్రశాంతంగా చూసి ‘మనం కాశీకి వెళ్లి మహాశివుని దర్శించుకోకున్నా ఫరవాలేదు. కళ్లెదురుగా ఉన్న సజీవ దైవాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా? మానవసేవే మాధవసేవ అని మర్చిపోయావా?!’ అన్నాడు.

శిష్యుడు తన తప్పు తెలుసుకుని తక్షణం గురువాజ్ఞ పాటించాడు.

- లేఖ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని