శ్లోకామృతం

గచ్ఛన్‌ పిపీలికా పంక్తిః సముద్ర మధిగచ్ఛతిఅగచ్ఛన్‌ వైనతేయోపి పదమేకం న గచ్ఛతి!ఎంతో నెమ్మదిగా వెళ్లే చీమలు సైతం నడవటం మొదలుపెడితే సముద్రాన్ని అయినా దాటగలవు.

Updated : 19 Aug 2021 01:49 IST

గచ్ఛన్‌ పిపీలికా పంక్తిః సముద్ర మధిగచ్ఛతి
అగచ్ఛన్‌ వైనతేయోపి పదమేకం న గచ్ఛతి!

ఎంతో నెమ్మదిగా వెళ్లే చీమలు సైతం నడవటం మొదలుపెడితే సముద్రాన్ని అయినా దాటగలవు. వేగంగా పయనించే గరుత్మంతుడు కూడా ఉన్నచోటు నుంచి బయల్దేరకుంటే అడుగు దూరమైనా వెళ్లలేడు. కనుక ఎంతటివారైనా శ్రద్ధగా ఆరంభిస్తే కష్టమైన పనులైనా సరే పూర్తవుతాయి. ఇంత సామర్థ్యముంది, ఆ పని ఎంతసేపు పడుతుందిలెమ్మని నిర్లక్ష్యంగా ఉంటే తేలికైన పనులు కూడా పూర్తికావు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు