హింస - అహింస
పూర్వం ఒక సేవాతత్పరుడు అడవి మార్గంలో ప్రయాణిస్తున్నాడు. ప్రకృతి దృశ్యాలు చూస్తూ నడుస్తోంటే ఒకపక్క ఆహ్లాదంగా ఉన్నా మరోవంక ఆయాసం కలుగుతోంది. ఇంకో రెండు గంటలు గడిస్తేగానీ
పూర్వం ఒక సేవాతత్పరుడు అడవి మార్గంలో ప్రయాణిస్తున్నాడు. ప్రకృతి దృశ్యాలు చూస్తూ నడుస్తోంటే ఒకపక్క ఆహ్లాదంగా ఉన్నా మరోవంక ఆయాసం కలుగుతోంది. ఇంకో రెండు గంటలు గడిస్తేగానీ గœమ్యం చేరుకోలేడు.
కాస్త ముందుకు నడిచేసరికి అతనికి వేటకు వెళ్లి తిరిగొస్తున్న పది పన్నెండేళ్ల కుర్రాడు ఎదురయ్యాడు. అతడి భుజం మీదున్న కర్రకు రెండు చనిపోయిన పక్షులు వేళ్లాడుతున్నాయి. మరో చేతిలో చద్ది మూట ఉంది. సేవాతత్పరుడు అతణ్ని పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ కుర్రాడికి జీవ కారుణ్యం గురించి చెప్పాలనిపించింది. జీవహింస ఎంతటి పాప కార్యమో వివరించాడు. అతడు మౌనంగా వింటూ నడుస్తున్నాడు.
కొంత సేపటికి ఇద్దరూ భోజనం చేసేందుకు ఒక చెట్టు కింద ఆగారు. తమ మూటలు విప్పి తినడం మొదలుపెట్టారు. భోజనం పూర్తయ్యేసరికి కుర్రాడి గిన్నె శుభ్రంగా తుడిచినట్టుగా ఉంది. సేవాతత్పరుడి గిన్నె చుట్టూ మెతుకులూ, మిరపకాయలూ కొన్ని కూరగాయ ముక్కలూ ఉన్నాయి.
అప్పుడు ఆ కుర్రాడు మాట్లాడటం మొదలుపెట్టాడు.
‘స్వామీ! హింస అంటే కేవలం వినోదం కోసం జీవుల్ని చంపడం. ఆహారం కోసం చంపడం కాదు. అహింస అంటే ఆహార పదార్థాలను వృథా చేయకపోవడం. మీరు తెచ్చుకున్న ఆహారం ఎంత కింద పడేశారో చూడండి. నేను తీసుకెళ్తున్న ఈ పక్షులు కనీసం ఒకరోజయినా మా కుటుంబం ఆకలి తీరుస్తాయి’ అంటూ లేచి బయల్దేరాడు.
- సమీర్ ధర్మశాస్త
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Law Commission: అప్పట్లో.. శృంగార సమ్మతి వయసు ‘పదేళ్లే’!
-
జీతం లేకుండా పనిచేస్తానన్న సీఈఓ.. కారణం ఇదే..!
-
EPFO: అధిక పింఛను వివరాల అప్‌లోడ్‌కు మరింత గడువు