జీవితం గురించి చింతించకండి

క్రీస్తు ప్రభువు ధర్మప్రచారం చేస్తున్న రోజుల్లో ఒకసారి చాలామంది జనం గుమిగూడారు. వారిలో కొందరు జీవితం పట్ల దిగులు చెందుతున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. అప్పుడు వారికి ధైర్యం చెబుతూ ‘ఆహార పానీయాలు, వస్త్రాల గురించి మీరు దిగులుచెందవద్దు.

Updated : 04 Nov 2021 06:32 IST

క్రీస్తు ప్రభువు ధర్మప్రచారం చేస్తున్న రోజుల్లో ఒకసారి చాలామంది జనం గుమిగూడారు. వారిలో కొందరు జీవితం పట్ల దిగులు చెందుతున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. అప్పుడు వారికి ధైర్యం చెబుతూ ‘ఆహార పానీయాలు, వస్త్రాల గురించి మీరు దిగులుచెందవద్దు. భోజనం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి. ఒకసారి తల పైకెత్తి ఆకాశంలో పక్షుల్ని చూడండి. అవి సాగు చేయవు. గోదాముల్లో ఆహారం నిలవ చేయవు. అయినా ఎన్నడూ పస్తులుండవు. ఇక వస్త్రాల గురించి చింత దేనికి? ఒకసారి అడవి కుసుమాలను చూడండి. వాటి పోషణ గురించి ఆలోచించండి. అవి నేత నేయవు కానీ అద్భుత రంగుల్లో, అనేక రకాలుగా పుష్పిస్తాయి. ఈరోజు వికసించి, రేపటికి వాడిపోయే పుష్పాలను అలా అలంకరించిన దేవుడు మీకు వస్త్రాలు ఇవ్వలేడా?! పోనీ మీరెవరైనా ఎత్తుగా లేనని చింతించి అంగుళ మయినా పెరగగలరా? కనుక ఏ విషయంలోనూ దుఃఖించాల్సిన అవసరం లేదు. దేవుని పట్ల విశ్వాసం ముఖ్యం’ అంటూ ఉపదేశించారు.

ఇక్కడ ఆహార పానీయాలు, వస్త్రాల కోసం ఆలోచించ కూడదనేది క్రీస్తు భావం కాదు. జీవితంలో ప్రాధాన్యతలు ఎలా ఉండాలన్నది ఆయన ఉపదేశం. దేవుని పట్ల విశ్వాసం, నైతిక విలువలు, సాటి మనిషి పట్ల ప్రేమ, పేదలకు సాయపడటం లాంటివి ముఖ్యం అన్నదే క్రీస్తు సందేశం.

- కొలికపూడి రూఫస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని