దున్నపోతును విసిగించిన కోతి
వారణాసి నగరాన్ని బ్రహ్మదత్తుడు పాలిస్తున్న రోజుల్లో.. బోధిసత్వుడు అరణ్యంలో దున్నపోతుగా జన్మించాడు. దయాస్వభావుడైన ఆయన్ను ఓ కోతి ఇబ్బందిపెట్టేది. మహిషం నిద్ర పోతుంటే దానిపైకి దూకడం,
వారణాసి నగరాన్ని బ్రహ్మదత్తుడు పాలిస్తున్న రోజుల్లో.. బోధిసత్వుడు అరణ్యంలో దున్నపోతుగా జన్మించాడు. దయాస్వభావుడైన ఆయన్ను ఓ కోతి ఇబ్బందిపెట్టేది. మహిషం నిద్ర పోతుంటే దానిపైకి దూకడం, కొమ్ములు పట్టుకుని తిప్పడం, చెవుల్లో పుల్లలు దూర్చడం లాంటివి చేసి ఆనందించేది. ఇదంతా గమనిస్తున్న ఓ యక్షుడు బోధిసత్వుణ్ణి సమీపించి.. ‘ఓ మహిషమా! కొండల్ని పిండి చేసే బలం నీకున్నా, ఈ కోతిని ఎందుకు భరిస్తున్నావు?’ అనడిగాడు.
దానికి మహిషరూపంలో ఉన్న బుద్ధుడు ‘నిజమే.. నేనీ కోతిని చంపడానికి క్షణకాలం పట్టదు. కానీ దానివల్ల నాకొచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ. దుర్బలులపై వీరత్వం చూపి నా బలాన్ని తక్కువ చేసుకోలేను. గుణపరాభవం కన్నా వ్యక్తి పరాభవం మేలు. ఎట్టి స్థితిలోనూ క్షమ, ఓర్పులను కోల్పోకూడదు. అందుకే ఈ కోతిని క్షమిస్తున్నాను’ అన్నాడు.
దాంతో యక్షుడు ‘తమరు సంపూర్ణ సాధు స్వభావులు’ అంటూ ప్రశంసించి, కోతిని అక్కణ్ణించి తరిమి మహిషం బాధ తొలగించాడు.
- ఎ.ఎం.నాగప్రసాద్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ
-
Ravichandran Ashwin అదృష్టమంటే అశ్విన్‌దే.. క్రికెట్ అభిమానులు సుడిగాడు అంటున్నారు!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Law Commission: అప్పట్లో.. శృంగార సమ్మతి వయసు ‘పదేళ్లే’!
-
జీతం లేకుండా పనిచేస్తానన్న సీఈఓ.. కారణం ఇదే..!
-
EPFO: అధిక పింఛను వివరాల అప్‌లోడ్‌కు మరింత గడువు