దెబ్బకు దెబ్బ సమర్థనీయం కాదు

క్రీస్తు ఒకసారి శిష్యులతో మాట్లాడుతూ ‘మిమ్మల్ని ప్రేమించేవారినే మీరూ ప్రేమించంలో విశేషమేమీ లేదు. దేవుడికి ఇష్టులుగా ఉండాలంటే శత్రువును కూడా ప్రేమించాలి. అప్పుడే పరిపూర్ణత. దేవుణ్ణి చూడండి, మంచి, చెడ్డ అందరి

Updated : 25 Jul 2022 18:22 IST

క్రీస్తు ఒకసారి శిష్యులతో మాట్లాడుతూ ‘మిమ్మల్ని ప్రేమించేవారినే మీరూ ప్రేమించంలో విశేషమేమీ లేదు. దేవుడికి ఇష్టులుగా ఉండాలంటే శత్రువును కూడా ప్రేమించాలి. అప్పుడే పరిపూర్ణత. దేవుణ్ణి చూడండి, మంచి, చెడ్డ అందరి పొలాల మీదా వర్షం కురిపిస్తాడు, సూర్యకాంతి ప్రసరింపజేస్తాడు. అంత మంచి దేవుడికి బిడ్డలైన మీరూ ఆ స్వభావాన్ని అలవరచు కోవాలి. దెబ్బకు దెబ్బ తీయడం క్రూరత్వానికి చిహ్నం. అది తగదు. మూడు సూత్రాలు గుర్తుంచుకోండి! ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడమచెంప చూపాలి. రెండోది.. పేదలు చలికి కప్పుకునేందుకు ఒక వస్త్రం అడిగితే, రెండు ఇవ్వండి. ఇక మూడోది.. ఎవరైనా అప్పు అడిగితే ముఖం తిప్పుకోవద్దు’ అంటూ ఉపదేశించాడు. దీని వెనుక ఉద్దేశం ఏమంటే, నాటి సమాజంలో ఏడేళ్లకోసారి రుణమాఫీ ఉండేది. ఆ కాలం దగ్గరపడుతున్నపుడు ఎవరైనా అప్పు అడిగితే ఇచ్చేందుకు మనసొప్పేది కాదు, ఆ రుణాన్ని మాఫీ చేయాల్సివస్తుందని. అందుకే పదిమంది మోసగాళ్లున్నా, పదకొండో వ్యక్తి నిజంగా అవసరంలో ఉండొచ్చు.. అతడి బాధ తీరుతుందన్నది క్రీస్తు భావం. కాలక్రమేణా వందమంది దోషులు తప్పించుకున్నా సరేకానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్న న్యాయసూక్తిగా స్థిరపడింది.

- కొలికపూడి రూఫస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని