ప్రాపంచిక భ్రమలు

అడవిలో ప్రయాణిస్తోన్న ఓ వ్యక్తి దారితప్పాడు. మనిషిని చూసిన సింహం గాండ్రిస్తూ అతన్ని వెంబడిస్తోంది. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడుకోవడానికి తన చెట్టు ఊడ సాయంతో బావిలోకి దిగాడు. కిందికి తొంగి

Published : 19 May 2022 00:22 IST

అడవిలో ప్రయాణిస్తోన్న ఓ వ్యక్తి దారితప్పాడు. మనిషిని చూసిన సింహం గాండ్రిస్తూ అతన్ని వెంబడిస్తోంది. ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడుకోవడానికి తన చెట్టు ఊడ సాయంతో బావిలోకి దిగాడు. కిందికి తొంగి చూస్తే బావిలో పెద్ద తాచుపాము బుసలుకొడుతూ కనిపించింది. చేసేదేమీలేక బావి మధ్యలోనే తాడుకు వేలాడుతూ ఉండిపోయాడు. చూస్తుండగానే తాడును తెలుపు, నలుపు ఎలుకలు కొరకసాగాయి. అంతలో పై నున్న తేనెతుట్టె నుంచి తేనె చుక్కలు జారుతూ కనిపించాయి. ఆ తేనె చుక్కలను నాలుక జాపి చప్పరిస్తున్నాడు. పైకెళ్దామంటే సింహం కాచుకుని కూర్చుంది. కిందికి దిగుదామంటే తాచుపాము బుసలు కొడుతోంది. మరోవైపు ఎలుకలు తాడును కొరుకుతున్నాయి. అంతటి ప్రమాదం పొంచిన స్థితిలో కూడా అతను తేనె చుక్కలను అందుకుంటూనే ఉన్నాడు. ఈ కథను ఇమామ్‌ గజాలీ రహ్మతుల్లాహ్‌ అనే మహనీయులు ఇలా విశ్లేషించారు. వెంబడించే సింహం మృత్యువు. నలుపు, తెలుపు ఎలుకలు పగలు,  రాత్రులు. జీవితమనే తాడును మెల్లగా కొరుకుతున్నాయి. తాచుపాము సమాధి గొయ్యి. ప్రతి ఒక్కరూ అందులోకి వెళ్లాల్సింది. తేనె ప్రాపంచిక జీవితం. దాని మాయలో మృత్యువును, సమాధి కుహురాన్ని, పరలోక జీవితాన్ని మర్చిపోతారు. తాత్కాలిక సుఖాల కోసం పరలోక జీవితాన్ని విస్మరించకూడదన్నది సారాంశం.

- తహూరా సిద్దీఖా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని