ఆమె లేకుంటే...
బుద్ధుడు దేశ పర్యటనలో ఉండగా, అవంతీ నగరంలో చాతుర్మాస్య దీక్ష ఆరంభించాల్సి వచ్చింది. వానాకాలం ఆరంభం కావడంతో దారులన్నీ జలమయం అయ్యాయి.
బోధివృక్షం
బుద్ధుడు దేశ పర్యటనలో ఉండగా, అవంతీ నగరంలో చాతుర్మాస్య దీక్ష ఆరంభించాల్సి వచ్చింది. వానాకాలం ఆరంభం కావడంతో దారులన్నీ జలమయం అయ్యాయి.
అవంతీనగర ప్రభువు బుద్ధుడికి, ఆయన పరివారానికి విశాలమైన విడిది ఏర్పాటుచేశాడు. బుద్ధుడి బోధలు వినడానికి కొందరు గృహిణులు ఆసక్తి చూపారు. వారిలో రాజకుటుంబానికి చెందిన స్త్రీలు కూడా ఉన్నారు. అయితే వారి భర్తలు అందుకు అనుమతించలేదు. కారణం వారు వైరాగ్యం చెంది సంసారజీవితం వదిలేస్తారని భయం.
బుద్ధుడికి ఎలాగో ఈ విషయం తెలిసింది.
మర్నాటి బోధనలో ప్రధాన విషయంగా స్త్రీలు గృహిణులుగా నిర్వహించే అద్భుతమైన పాత్ర గురించి ప్రశంసాపూర్వకంగా ప్రసంగించాడు బుద్ధుడు.
చివరిగా ‘మీరు మీ భార్యల్ని సరిగ్గా చూసుకుంటున్నారా?’ అని ప్రశ్నించాడు.
ఈ ప్రశ్నతో అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కొద్దిసేపు వారి మధ్య చర్చలు జరిగాయి. చివరికి తేలిందేమంటే వారి భార్యల కోసం ప్రత్యేకంగా ఎవరూ ఏమీ చేయడం లేదు. ‘కొందరు భార్యను సేవకురాలిగా, మరికొందరు కేవలం ఇంటికి పరిమితమైన ఇల్లాలిగా, నగలు ఇస్తే సంతోషపడుతుందిలే అనే ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ఆమె ఆశలను, ఆకాంక్షలను ఎవరూ గౌరవించడం లేదు. ఆమెకో మనసు ఉంటుందని కూడా ఎవరూ అనుకోవడం లేదు. కనీసం ఆమె తన మనోభావాలను వ్యక్తపరిచే అవకాశాలు కూడా ఇవ్వడం లేదు. గృహ యజమాని తాను మహారాజభోగం అనుభవిస్తున్నాడు కానీ భార్యకు ఆ స్థాయి ఇవ్వడం లేదు.
అప్పుడు మళ్లీ అడిగాడు బుద్ధుడు ‘నా ప్రశ్నకు మీ సమాధానం ఏంటి?’ అని ఒక్కొక్కరు తమ తప్పులను అంగీకరించారు.
‘ఇప్పుడు వినండి. భార్య లేకపోతే గృహస్థ జీవితమే లేదు. మీ గృహాలను వెలిగించేవి దీపాలు కావు. ఆ దీపాలను వెలిగించే ఇల్లాలి చేతులు. ఇంటికి శాంతిని, క్రాంతిని ప్రసాదించేది భార్య. బుద్ధుడి బోధలు వినే అర్హత వారికీ ఉంది. వాళ్లని ఆటంకపరచకండి’ అన్నాడు. మరునాడు వారంతా తమ భార్యలతో సహా తథాగతుడి బోధనలు విన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ